అందరూ అదే చేస్తున్నారు.. నాకెందుకు సిగ్గు..తమన్నా షాకింగ్ కామెంట్స్
X
బాలీవుడ్లో ఇప్పుడు మిల్కీ బ్యూటీ తమన్నా హవా నడుస్తోంది. వరుసగా వెబ్ సిరీస్‌లలో నటిస్తూ బిజీ బిజీగా ఉంటోంది. ఈమధ్యనే ఓటీటీలో విడుదలైన జీ కరదా వెబ్ సిరీస్‌లో బోల్డ్‌గా నటించి అందరి మైండ్ బ్లాక్ చేసింది తమన్నా. ఇదే ఊపులో లస్ట్ స్టోరీస్ 2తో జూన్ 29న మరోసారి తన యాక్టింగ్ పెర్ఫార్మెన్స్తో ఇరగదీయాలని ఫిక్స్ అయ్యింది. నిజానికి తమన్నా అనగానే తెలుగు ప్రేక్షకులకు ఆమె డ్యాన్స్ మూవ్స్ గుర్తుకు వస్తాయి. ఆమె ఎనర్జీ, గ్రేస్ ముందు ఏ హీరోయిన్ కూడా పనికిరాదు. అలాంటి ఈ చిన్నది ఇప్పుడ అందాల ప్రదర్శనతో బోల్డ్ యాక్టింగ్‌తో ఓటీటీని షేక్ చేస్తోంది. ఈ మధ్యనే విడుదలైన లస్ట్ స్టోరీస్ 2 ట్రైలర్లో తమన్నా హద్దు చెరిపి మరీ రెచ్చిపోయిందని, బోల్డ్ పాత్రల్లో అశ్లీల సీన్స్‌లో నటించిందన అభిమానులు పీల్ అవుతున్నారు.
ఈ బోల్డ్ సిరీస్‌పైన తాజాగా తమన్నా స్పందించింది. షాకింగ్ కామెంట్స్ చేసింది." లస్ట్ స్టోరీస్ ఫస్ట్ పార్ట్ చూశాక నా అభిప్రాయం మారిపోయింది. ప్రేక్షకులు కూడా ఇలాంటి కంటెంట్‌నే ఇష్టపడుతున్నారు. కాలంతో పాటు ప్రేక్షకుల ఆలోచనలు, అభిరుచులు మారుతున్నాయి. నాకు తెలిసిన ప్రేక్షకులు లస్ట్ స్టోరీస్ మొదటి సీజన్ చేసే ఉంటారు. ఓ నటిగా ఇప్పటి వరకు అభిమానులు నన్ను చూడని విధంగా చూపించాలనుకున్నాను. నటిగా నాకు అది చాలా అవసరం.
ఓ హీరోయిన్ గా నన్ను నేను నిరూపించుకోవాలనే ఆకలితో ఉన్నాయి. ఇప్పటి వరకు నా కెరీర్లో ఇలాంటి సీన్స్‌లో నటించలేదు. సినిమాలో ఇతర సన్నివేశాలు ఎలాంటివో ఇది అలాగే అని ఆలస్యంగా తెలుసుకున్నాను. నాకు బోల్డ్ సీన్స్‌లో నటించేప్పుడు భయం వేయలేదు. నా ప్రియుడు విజయ్ వర్మ నాకు ఎంతో సపోర్టివ్‌గా ఉన్నాడు. జాగ్రత్తగా చూసుకున్నాడు" అని తమన్నా చెప్పుకొచ్చింది.