Home > సినిమా > ఆ సినిమాలో నా యాక్టింగ్ నాకే నచ్చదు..తమన్నా

ఆ సినిమాలో నా యాక్టింగ్ నాకే నచ్చదు..తమన్నా

ఆ సినిమాలో నా యాక్టింగ్ నాకే నచ్చదు..తమన్నా
X

హిందీ వెబ్ సిరీస్‎లతో ఓటీటీలో రచ్చ రచ్చ చేసిన మిల్కీ బ్యూటీ తమన్నా.. వరుసగా తెలుగు సినిమాలతో వెండితెరపై అలరించేందుకు రెడీ అయ్యింది. కోలీవుడ్ స్టార్ హీరో రజనీకాంత్‎తో కలిసి నటించిన జైలర్ మూవీ ఈ ఆగస్టు 10న బిగ్ స్క్రీన్ మీద విడుదల కానుంది. ఇప్పటికే ఈ సినిమాలోని 'నువ్ కావాలయ్యా' పాటతో సోషల్ మీడియాలో ట్రెండిగ్‎లో ఉంది తమన్నా. సినిమా రిలీజ్ దగ్గర పడుతుండటంతో పనిలో పనిగా ప్రమోషన్స్‎ను కూడా చేసేస్తోంది. ఈ చిన్నది వరుస ఇంటర్వ్యూలతో తన సినీ అనుభవాలను అభిమానులతో పంచుకుంటోంది. తాజాగా తమన్నా తాను నటించిన ఓ ఫ్లాప్ మూవీ గురించి ఆసక్తికరమైన విషయాలను పంచుకుంది. విజయ్, తమన్నా కాంబినేషన్‎లో వచ్చిన సుర డిజాస్టర్‎కు గల కారణాన్ని వివరించింది.

తమిళ యాక్టర్ విజయ్‌, మిల్కీ బ్యూటీ తమన్నా కాంబినేషన్‎లో వచ్చిన సినిమా నటించిన చిత్రం ‘సుర’. ఈ మూవీలోని పాటలు ప్రేక్షకాదరణ పొందినా, ..సినిమా మాత్రం బాక్సాఫీస్ వద్ద మాత్రం డిజాస్టర్‎గా నిలిచింది. విజయ్‌ కెరీర్‌లోనే సుర బిగ్గెస్ట్‌ ఫ్లాప్‌ మూవీ. ఈ సినిమా గురించి తాజాగా ఇంటర్వ్యూలో తమన్నా మాట్లాడుతూ.. ‘‘నాకు సుర సినిమా అంటే చాలా ఇష్టం. ఈ మూవీలోని పాటలు ఇప్పటికీ వినిపిస్తూనే ఉంటాయి. కానీ,సినిమాలోని కొన్ని సీన్స్‎లో నా యాక్టింగ్ నాకే నచ్చలేదు. నా నటనే కాదు కొన్ని సీన్స్ కూడా సరిగా రాలేదు. షూటింగ్‌ సమయంలోనే సినిమా గురించ ఓ అంచనా వచ్చింది. కానీ ఏం చేయలేము. ఒప్పందం ప్రకారం సినిమా ఎలా ఉన్నా పూర్తి చేయాల్సిందే. హీరోహీరోయిన్లు ఒక్కసారి సినిమాను అంగీకరించిన తర్వాత కచ్చితంగా దాన్ని చేసి తీరాల్సిందే. సినీ ఇండస్ట్రీలో హిట్టు, ఫ్లాపులతో సంబంధం ఉండదు. ఈ ఇండస్ట్రీ చాలా విలువైనది. కాబట్టి ప్రతిఒక్కరు బాధ్యతాయుతంగా ఉండాలి. ఇదంతా మన ప్రొఫెషన్‎లో భాగం’’ అని తమన్నా చెప్పుకొచ్చింది.


Updated : 31 July 2023 8:10 PM IST
Tags:    
Next Story
Share it
Top