Mansoor Ali Khan : చిరంజీవి మాత్రం తక్కువా? మన్సూర్ అలీఖాన్ సంచలన ఆరోపణలు
X
నటి త్రిషపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన తమిళ నటుడు మన్సూర్ అలీఖాన్‌పై విమర్శలు ఆగడం లేదు. అతడు కూడా వెనక్కి తగ్గడం లేదు. బలవంతంమీద క్షమాపణ చెప్పినా విమర్శలకు దీటుగా బదులిస్తున్నాడు. తనది వక్రబుద్ధి అయితే మిగతావాళ్లేం సద్గుణసంపన్నులా అంటూ ప్రశ్నిస్తున్నాడు. తనును విమర్శించి టాలీవుడ్ హీరో చిరంజీవిపైనా విరుచుకుపడుతూ సంచలన ఆరోపణలు చేశారు. అయన పార్టీ పేరుతో డబ్బులు గుంజి సొంతానికి వాడుకున్నాడని, హీరోయిన్లకు మాత్రమే విందులు ఇస్తుంటాడని అన్నాడు.
‘లియో’ చిత్రంలో తను త్రిషను అత్యాచారం చేసే సీన్ పెట్టి ఉంటే బావుండేదంటూ మన్సూర్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపడం తెలిసిందే. వక్రబుద్ధి ఉన్నవాళ్లు మాత్రమే అలా అంటారని చిరంజీవి త్రిషకు మద్దతుగా ట్వీట్ చేశారు. దీనిపై మన్సూర్ అగ్గి ఫైరయ్యాడు. ‘‘చిరంజీవి అసలు విషయమేంటో తెలుసుకోకుండా నన్ను తిట్టాడు. ఆయన మాత్రం తక్కువా, ఆయనది వక్రబుద్ధి కాదా? పార్టీ పెట్టి వేల కోట్లు సంపాదించుకుని సొంతానికి వాడుకున్నాడు. పేదలకు సాయం చేయలేదు. ఆయన తమ్ముడు పవన్ కళ్యాణ్ కూడా పార్టీ పెట్టాడు. వాళ్ల చేసేదేంటో నాకు తెలియదు. డబ్బంతా వాళ్లే వాడుకుంటున్నారు. చిరంజీవి ప్రతి సంవత్సరం ఓల్డ్ హీరోయిన్లకు మాంచి పార్టీలు ఇస్తుంటాడు. హీరోయిన్లు మాత్రమే పిలుస్తుంటాడు. నన్నెప్పుడూ పిలవలేదు. దానికి నేనేమీ అనుకోను. నాపై పెట్టేముందు ఫోన్ చేసి విషయం కనుక్కుని ఉంటే బావుండేది. నా పరువు తీసిన చిరంజీవిపై రూ. 20 కోట్లకు పరువునష్టం దావా వేస్తున్నాను. నన్ను తిట్టిన త్రిష, కుష్బూలపైనా రూ. 10 కోట్ల చొప్పున పరువు నష్టం దావా వేస్తా..’’ అని అన్నాడు.