Home > సినిమా > డ్రగ్స్ కేసుపై స్పందించిన వరలక్ష్మి.. ఆమె మాజీ మేనేజర్‌కు తీవ్రవాదులతో లింక్

డ్రగ్స్ కేసుపై స్పందించిన వరలక్ష్మి.. ఆమె మాజీ మేనేజర్‌కు తీవ్రవాదులతో లింక్

డ్రగ్స్ కేసుపై స్పందించిన వరలక్ష్మి.. ఆమె మాజీ మేనేజర్‌కు తీవ్రవాదులతో లింక్
X

మాదక ద్రవ్యాల కేసులో నటి వరలక్ష్మికి ఎన్ఐఏ నుంచి నోటీసులు వచ్చాయనే వార్తలు కోలీవుడ్‌లో కలకలం రేపుతున్నాయి. ప్రస్తుతం సినిమా షూటింగుల్లో బిజీగా ఉన్న ఆమెకు ఇవి తలనొప్పిగా మారాయి. దీనిపై ఆమె ఓ ప్ర్రకటన జారీ చేసింది. జాతీయ దర్యాప్తు సంస్థ నుంచి తనకు ఎలాంటి నోటీసులూ అందలేని, అవససరమైతే ఈ కేసు విచారణలో అధికారులకు సహకరిస్తానని తెలిపింది.

వరలక్ష్మి దగ్గర మేనేజర్‌గా పనిచేసిన ఆదిలింగం అనే వ్యక్తిని కేరళ డ్రగ్స్ కేసులో ఎన్ఏఐ పోలీసులు అరెస్ట్ చేయడంతో ఆమెను కూడా విచారిస్తారనే వార్తలు వస్తున్నాయి. దీనిపై ఆమె స్పందిస్తూ ఆదిలింగం మూడేళ్ల కిందట తన దగ్గర కొద్దికాలం మాత్రమే పనిచేశాడని, డ్రగ్స్ కేసుతో తనకెలాంటి సంబంధమూ లేదని వెల్లడించింది. ‘‘ఆదిలింగం నా దగ్గర ఫ్రీలాన్స్‌ మేనేజరుగా పనిచేసిన మాట నిజమే. ఇప్పుడు ఎక్కడ ఉన్నాడో నాకు తెలియదు. అతనితో ఎలాంటి సంబంధాలూ లేవు. నాకు ఎన్‌ఐఏ నుంచి ఎలాంటి సమన్లూ రాలేదు. కేసు విచారణలో అధికారులకు సాయపడతాను’’ అని చెప్పాంది.

ఆదిలింగానికి కోలీవుడ్ సెలబ్రిటీలతోపాటు వ్యాపార, రాజకీయ రంగాల ప్రముఖుతో సంబంధాలున్నట్లు ఎన్ఐఏ అనుమానిస్తోంది. నిషేధిత శ్రీలంక వేర్పాటువాద సంస్థ ఎల్టీటీఈకి ఆయుధాలు, నిధులు సమకూర్చినట్లు అతనిపై ఆరోపణలు ఉన్నాయి. 2021లో కేరళలోని విలంజం బీచీలో డగ్ర్స్ ‌పాటు మారణాయుధాలు లభించాయి. ఈ కేసులో పలువురిని అరెస్ట్ చేశారు. ఆదిలింగం పేరు బయటికి రావడంతో అతణ్ని అదుపులోకి తీసుకున్నారు. మదురైకి చెందిన ఆదిలింగం ఆర్మీలో పనిచేసి వీఆర్ఎస్ తీసుకుని గుణశేఖరన్ అనే డ్రగ్స్ ముఠా నాయుకుడితో కలసి అక్రమాలకు పాల్పడుతున్నాడు. డ్రగ్స్, ఆయుధాల స్మగ్లింగ్ ద్వారా వచ్చిన డబ్బును సినిమాల్లో పెట్టుబడి పెట్టాడు. అతణ్ని విచారిస్తే మరింతమంది పేర్లు బయటికి రావొచ్చని ఎన్ఐఏ భావిస్తోంది.

Updated : 30 Aug 2023 9:42 AM IST
Tags:    
Next Story
Share it
Top