Home > సినిమా > సూర్యకు గాయాలు.. ఆస్పత్రికి తరలింపు..

సూర్యకు గాయాలు.. ఆస్పత్రికి తరలింపు..

సూర్యకు గాయాలు.. ఆస్పత్రికి తరలింపు..
X

ప్రముఖ తమిళ సినీ నటుడు సూర్య షూటింగ్‌లో గాయపడి ఆస్పత్రిలో చేరాడు. చెన్నైలో జరుగుతున్న 'కంగువ' చిత్రం షూటింగ్ ఓ భారీ యాక్షన్ సన్నివేశంలో ఆయనకు గాయమైంది. ఓ రోప్ కెమెరా క్రేన్ నుంచి ఊడిపోయి అతని భుజంపై పడింది. భుజానికి ఓ మాదిరి గాయం కావడంతో షూటింగ్ ముగించి ఆస్పత్రిలో చేర్పించారు. చికిత్స తర్వాత సూర్య కోలుకుంటున్నారని, కొన్నాళ్లు విశ్రాంతి తీసుకుని మళ్లీ షూటింగ్‌కు వస్తారని మూవీ టీమ్ తెలిపింది. కెమెరా భుజంపైన కాకుండా తలకు తగిలి ఉంటే పెద్ద ప్రమాదం జరిగేందని చెబుతున్నారు. సూర్య త్వరగా కోలుకోవాలని అభిమానులు పూజలు, ప్రార్థనలు చేస్తున్నారు. పీరియాడిక్ కథతో రూపొందుతున్న ‘కంగువ’ కోసం సూర్య చాలా బరువు తగ్గాడు. అతని సినిమాల్లో ఇదే భారీ బడ్జెట్ మూవీ. రూ. 300 కోట్లకుపైగా ఖర్చయినట్లు చెబుతున్నారు. ఈ మూవీ షూటింగ్ ఇటీవల థాయ్‌లాండ్‌లో జరిగింవది. 38 భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానున్న ఈ చిత్రానికి శివ దర్శకత్వం వహిస్తున్నారు. దిశా పఠానీ హీరోయిన్‌గా నటిస్తోంది.


Updated : 23 Nov 2023 6:42 PM IST
Tags:    
Next Story
Share it
Top