భార్యని వన్ సైడ్ లవ్ చేసే భర్త..కామెడీగా 'లవ్ గురు' ట్రైలర్
X
తమిళ స్టార్ హీరో విజయ్ ఆంటోనీ బిచ్చగాడుతో తెలుగు ప్రేక్షకులను కూడా సొంతం చేసుకున్నాడు. టాలీవుడ్‌లో బిచ్చగాడు, బిచ్చగాడు2తో మంచి హిట్స్ అందుకున్న విజయ్ ఆంటోనీ ఇప్పుడు లవ్ గురు మూవీతో ఆడియన్స్ ముందుకు రానున్నాడు. దర్శకుడు వినాయక్ వైద్యనాథన్ ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నారు. విజయ్ ఆంటోనీ సరసన మృణాళిని రవి నటిస్తోంది. తమిళంలో ఈ మూవీ రోమియోగా రిలీజ్ కానుండగా తెలుగు లవ్ గురు పేరుతో విడుదల కానుంది.
తాజాగా లవ్ గుర్ ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ట్రైలర్ కడుపుబ్బా నవ్విస్తోంది. అమ్మాయికి ఇష్టం లేకుండా పెళ్లి చేస్తే తనకు వచ్చే భర్త ఎటువంటి కష్టాలు పడ్డాడు, తన భార్యని ఎలా మార్చుకున్నాడు అనేదే ఈ మూవీ స్టోరీ. కామెడీ చూపిస్తూనే ఎమోషన్స్ పండించారు. ట్రైలర్ మొదట్లో భార్యను వన్ సైడ్ లవ్ చేస్తాను అని హీరో చెప్పే డైలాగ్ హైలెట్‌గా నిలిచింది.
ఈ మధ్య కామెడీ సినిమాలు తెరపై సందడి చేస్తున్నాయి. ఇప్పుడు ఆ కేటగిరీలో వస్తోన్న లవ్ గురూ ప్రేక్షకులను ఏ విధంగా మెప్పిస్తుందో చూడాలి. లవ్ గురు మూవీ రంజాన్ కానుకగా రిలీజ్ చేయనున్నట్లు తెలుస్తోంది. అయితే దీనిపై అధికారిక అనౌన్స్‌మెంట్ రాలేదు. తెలుగులో ఈ మూవీని మైత్రి మూవీ మేకర్స్ రిలీజ్ చేయనున్నారు.