Home > సినిమా > తమిళ స్టార్ హీరోలకు రెడ్ నోటీసులు..!

తమిళ స్టార్ హీరోలకు రెడ్ నోటీసులు..!

తమిళ స్టార్ హీరోలకు రెడ్ నోటీసులు..!
X

తమిళ సినీ ఇండస్ట్రీలో హీరోలు, నిర్మాతల మధ్య వివాదం రోజురోజుకి ముదురుతోంది. ఈ నేపథ్యంలో తమిళ స్టార్ హీరోలకు నిర్మాతల మండలి ఝలక్ ఇచ్చింది. ఐదుగురు హీరోలకు ఏకంగా రెడ్ కార్డ్‌ ఇవ్వాలని డిసైడ్ అయింది. ప్రస్తుతం ఈ టాపిక్ కోలీవుడ్లో సంచలనంగా మారింది. కొందరు స్టార్లు తమతో సినిమాలకు అడ్వాన్సులు తీసుకుని డేట్లు ఇవ్వడం లేదని పలువురు నిర్మాతలు ప్రొడ్యూసర్ కౌన్సిల్కు ఫిర్యాదు చేశారు.

ఈ నేపథ్యంలో హీరోలు విశాల్‌, శింబు, అధర్వ, ఎస్‌జే సూర్య, యోగిబాబులకు రెడ్‌ కార్డ్‌ ఇవ్వాలని ప్రొడ్యూసర్ కౌన్సిల్ నిర్ణయించింది. వారు నిర్మాతలకు సహకరించడం లేదని ఆరోపించింది. హీరోలు ఇచ్చే సమాధానం ఆధారంగా తదుపరి చర్యలు తీసుకోనున్నారు. సరైన కథలతో కాకుండా పిచ్చి కథలతో ముందుకు వస్తే ఎలా డేట్లు సర్దుబాటు చేస్తామని సదరు నటులు అసహనం వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం.

విశాల్‌, శింబు, అధ‌ర్వ వ‌రుస చిత్రాల్లో న‌టిస్తూ బిజీ బిజీగా ఉన్నారు. విశాల్ మార్క్ ఆంటోనీ, తుప్పారి వాల‌న్ 2 సినిమాల్లో న‌టిస్తుండగా.. ఈ రెండు రిలీజ్‌కు రెడీ అవుతున్నాయి. ఎస్‌.జె. సూర్య శంక‌ర్ తెర‌కెక్కిస్తున్న ఇండియ‌న్ 2, గేమ్ ఛేంజ‌ర్ సినిమాల్లో విల‌న్ క్యారెక్టర్ పోషిస్తున్నారు. అంతేకాకుండా పలు సినిమాల్లో హీరోగా చేస్తున్నారు. అయితే నిర్మాత‌ల నిర్ణ‌యంపై వీరు ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాలి.


Updated : 19 Jun 2023 1:18 PM IST
Tags:    
Next Story
Share it
Top