Home > సినిమా > సూర్య హీరోగా భారీ బడ్జెట్తో కర్ణ

సూర్య హీరోగా భారీ బడ్జెట్తో కర్ణ

సూర్య హీరోగా భారీ బడ్జెట్తో కర్ణ
X

మహా భారతంలో కర్ణుడు కౌరవులవైపు ఉన్నా.. ఆ పాత్రను ఇష్టపడని వాళ్లు ఉండరు. త్యాగానికి, ధర్మానికి, ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండే తత్వానికి.. అంతకు మించి గొప్ప స్నేహానికి అతను కొలమానంగా నిలిచిపోయాడు. అందుకే ఈ పాత్రను భారతంలోని ఇతర పాత్రలకంటే ఎక్కువగా ఓన్ చేసుకుంటారు ప్రేక్షకులు. పైగా మారు తల్లితండ్రుల వద్ద పెరిగినా అసమాన పరాక్రమవంతుడు కూడా కావడం అతని పాత్రలోని హీరోయిజాన్ని ఎలివేట్ చేస్తుంది. అందుకే ఈ పాత్రను ఎన్నిసార్లు చూసినా బోర్ కొట్టదు. ఇప్పుడున్న టెక్నాలజీని జోడించి భారత కథను చెబితే కమర్షియల్ గా అన్ని రికార్డులూ కనుమరుగవుతాయి. ఈ సాహసం రాజమౌళి వంటి దర్శకులే చేయాలి అనుకుంటారు చాలామంది. ఆయన భారతం మొదలుపెడితే రిలీజ్ కావడానికి పదేళ్లు పడుతుందనే సెటైర్స్ కూడా ఉన్నాయి. బట్ భారతాన్ని కాదు కానీ.. అందులోని ప్రధాన పాత్రగా ఉన్న కర్ణుడి పాత్రను మరోసారి వెండితెరపై ఆవిష్కరించబోతున్నాడు బాలీవుడ్ దర్శకుడు రాకేష్ ఓమ్ ప్రకాష్ మెహ్రా. కర్ణుడి పాత్రలో సౌత్ స్టార్ సూర్య నటించబోతున్నాడు.

రాకేష్ మెహ్రా.. రంగ్ దే బసంతి, ఢిల్లీ6, భాగ్ మిల్కా భాగ్ వంటి సూపర్ హిట్ మూవీస్ తో తనకంటూ ఓ క్రేజ్ తెచ్చుకున్నాడు. అలాంటి దర్శకుడితో సూర్య లాంటి మోస్ట్ టాలెంటెడ్ స్టార్ ఓ పౌరాణిక పాత్ర చేస్తే ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ ను ఎక్స్ పెక్ట్ చేయొచ్చు. కర్ణ పాత్ర సూర్య వ్యక్తిత్వానికి కూడా సరిపోతుంది. ఇది ఆ పాత్రకు సహజంగా కలిసొచ్చే అంశం అవుతుంది. ఈ చిత్రాన్ని 500 కోట్ల భారీ బడ్జెట్ తో రూపొందించబోతున్నారు. ఇంత పెద్ద బడ్జెట్ ఉన్నప్పుడు ఒక్క పార్ట్ ఏం సరిపోతుంది. అందుకే రెండు భాగాలుగానే విడుదల చేస్తారట. ఓ రకంగా కర్ణుడి పాత్రను గురించి చెప్పడం అంటే దాదాపు మహా భారతం మొత్తం చెప్పాల్సి ఉంటుంది. సో.. ఇది పూర్తిగా మహా భారతమే అనుకోవచ్చు. అంటే ఇతర పాత్రలు చాలా కీలకం. పైగా పౌరాణిక కథలు మనవాళ్లు తీసినట్టు నార్త్ మేకర్స్ ఇప్పటి వరకూ తీయలేదు.. తీయలేరు అని కూడా అంటారు. అందుకు ఈ మధ్యే వచ్చిన పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఆదిపురుష్. మరి ఈ హిందీ కర్ణ భారతం ఎలా ఉంటుందో కానీ ఆల్రెడీ ప్రీ ప్రొడక్షన్ స్టార్ట్ చేశారట. సినిమాటోగ్రాఫర్ గా రవి వర్మన్ ను తీసుకున్నారు. దర్శకుడు, ఈయనా కలిసి ప్రస్తుతం లొకేషన్స్ వేటలో ఉన్నారు.

Updated : 3 Oct 2023 6:49 PM IST
Tags:    
Next Story
Share it
Top