Home > సినిమా > ‘ప్రాజెక్ట్ కె’తో.. ప్రభాస్ రేంజ్ ఏంటో మొదటి రోజే తెలిసిపోతుంది: తమ్మారెడ్డి భరద్వాజ

‘ప్రాజెక్ట్ కె’తో.. ప్రభాస్ రేంజ్ ఏంటో మొదటి రోజే తెలిసిపోతుంది: తమ్మారెడ్డి భరద్వాజ

‘ప్రాజెక్ట్ కె’తో.. ప్రభాస్ రేంజ్ ఏంటో మొదటి రోజే తెలిసిపోతుంది: తమ్మారెడ్డి భరద్వాజ
X

టాలీవుడ్ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ.. తన యూట్యూబ్ ఛానల్ ద్వారా సినిమాలకు రివ్యూలు ఇస్తూ ఎప్పుడూ హాట్ టాపిక్ గా నిలుస్తుంటారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆయన.. నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో, ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న ప్రాజెక్ట్ కే గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రాజెక్ట్ కె.. పాన్ ఇండియా సినిమా కాదని, పాన్ వరల్డ్ సినిమా అని చెప్పుకొచ్చారు. హాలీవుడ్ టాప్ సినిమా జాబితాలో నిలుస్తుందని అభిప్రాయపడ్డారు.

‘ఇటీవలే రెండు సార్లు ప్రాజెక్ట్ కె షూటింగ్ సెట్స్ కు వెళ్లా. వాళ్లు తీస్తున్న విధానం నాకు బాగా నచ్చింది. సరైన పద్ధతిలో ప్రచారం చేస్తే.. ఈ సినిమా గ్లోబల్ స్టాయిలో నిలుస్తుంది. అయితే, అది వైజయంతీ మూవీస్ ప్రచార కార్యక్రమాల మీదే ఆధారపడి ఉంది. సరైన పద్ధతిలో ప్రచారం చేస్తే.. సినిమా విడుదల అయిన మొదటి రోజే రూ.500 నుంచి రూ.600 కోట్లు వసూలు చేసే అవకాశం ఉంది. ఒకవేళ సినిమా బాగుంటే.. కచ్చితంగా హాలీవుడ్ టాప్ సినిమాల జాబితాలో నిలుస్తుంది. అయితే, నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం 2024 సమ్మర్ లో ఈ సినిమా రిలీజ్ అయ్యే అవకాశం ఉంద’ని అయన అన్నారు.

Tammareddy Bharadwaj have interesting comments on Project K movie

Tammareddy Bharadwaj, Project K movie, tollywood news, bollywood news, latest news, telugu news, movie news, cinema news, entertainment, prabhas, nag ashwin

Updated : 27 Jun 2023 7:06 PM IST
Tags:    
Next Story
Share it
Top