Home > సినిమా > Tasty Teja: ‘సీక్రెట్’ కనిపెట్టిన తేజ.. బిగ్బాస్ ప్లాన్ను తిప్పికొట్టాడుగా?

Tasty Teja: ‘సీక్రెట్’ కనిపెట్టిన తేజ.. బిగ్బాస్ ప్లాన్ను తిప్పికొట్టాడుగా?

Tasty Teja: ‘సీక్రెట్’ కనిపెట్టిన తేజ.. బిగ్బాస్ ప్లాన్ను తిప్పికొట్టాడుగా?
X

బిగ్ బాస్ ఆరు సీజన్లను జనాలు బాగేనే చూశారు. ఆదరించారు. వైల్డ్ కార్డ్ ఎంట్రీలు, సీక్రెట్ రూంలు, టాస్క్ లు.. ఇలా ప్రతీ విషయం అందరికీ తెలిసిపోయింది. సీజన్ లో ఎలాంటి టర్న్ లు, ట్విస్ట్ లు ఉంటాయో ముందే పసిగట్టేస్తారు. బిగ్ బాస్ కు వచ్చే కంటెస్టెంట్స్ కూడా ఇదంతా ఫాలో అయి.. షోకు వస్తున్నారు. దాంతో బిగ్ బాస్ టీం తీసుకునే స్టెప్పులను ముందే ఊహించి తమ గేమ్ ప్లాన్ చేసుకుంటున్నారు. అందుకే ఈ ఏడో సీజన్ ను ఉల్టా పల్టాగా మార్చారు. అన్నీ ఉల్టా పల్టా నిర్ణయాలు తీసుకుంటూ.. కంటెస్టెంట్స్ ను బోల్తా కొట్టిస్తున్నాడు బిగ్ బాస్. ఇక్కడే అసలైన ట్విస్ట్ జరిగింది. బిగ్ బాస్ తీసుకున్న ఉల్టా పల్టా నిర్ణయాన్ని టేస్టీ తేజ ముందే పసిగట్టేశాడు.

ఎవ్వరూ ఊహించని విధంగా బిగ్ బాస్ ఒకేసారి ఐదుగురు కంటెస్టెంట్లను హౌస్ లోకి పంపించి షాక్ ఇచ్చాడు. ఈ క్రమంలో డబుల్ ఎలిమినేషన్ అనిచెప్పి.. శుభశ్రీతో పాటు గౌతమ్ ను ఎలిమినేట్ చేశాడు. కాగా బయటికి వచ్చిన గౌతమ్ ను సీక్రెట్ రూంలోకి పంపిచి మిగతా కంటెస్టెంట్స్ కు సర్ప్రైజ్ ఇద్దామనుకున్నాడు బిగ్ బాస్. అయితే గౌతమ్ ది ఎలిమినేషన్ కాదని.. సీక్రెట్ రూంలోకి పంపిచారని కంటెస్టెంట్స్ కు అర్థం అయిపోయింది. ఎందుకంటే గౌతమ్ వాడే బెడ్, లగేజ్ అంతా హౌస్ లోనే ఉంచారు. దీంతో అనుమాన పడ్డ టేస్టీ తేజ.. గౌతమ్ ను సీక్రెట్ రూంలో ఉంచారని పసిగట్టాడు. ఒక వేళ ఎలిమినేటై ఉంటే గౌతమ్ బెడ్ ఖాళీ అయ్యేదని, పైగా ఎలిమినేషన్ అనేది జనాల చేతిలో ఉంటుంది కానీ కంటెస్టెంట్ల ఓట్లతో ఎలిమినేట్ అవ్వలేరని తేజ లాజిక్‌ పట్టుకున్నాడు. దీంతో బిగ్ బాస్ సీక్రెట్ రూం టాస్క్ బట్టబయలయింది.


Updated : 9 Oct 2023 10:04 PM IST
Tags:    
Next Story
Share it
Top