భయపెడుతోన్న ‘మా ఊరి పొలిమేర2’ టీజర్
X
మోస్ట్ అండర్ రేటెడ్ హారర్ జానర్ ఫిల్మ్ మా ఊరి పొలిమేర. రెండేళ్ల క్రితం ఓటీటీలో రిలీజ్ అయి అదరగొట్టింది. క్లైమాక్స్ కు ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. సినిమాలోనే రెండో భాగం ఉంటుందని ప్రకటించగా.. సీక్వెల్ ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని అభిమానులు ఎదురుచూస్తున్నారు. దాంతో సినిమా సీక్వేల్ ను రిలీజ్ చేసే పనిలో పడింది చిత్ర బృందం. శనివారం (జులై 1) 2 పార్ట్ టీజర్ ను విడుదల చేసింది. బ్లాక్ మ్యాజిక్ కాన్సెప్ట్ తో రిలీజ్ అయిన పార్ట్ 1కు ఏమాత్రం తీసిపోకుండా.. 2వ పార్ట్ ను తెరకెక్కించినట్లు తెలుస్తోంది. కేవలం టీజర్ చూస్తేనే ఆడియన్స్ వెన్నులో వణుకు పుడుతోంది.
టీజర్ షార్ట్స్ లోనే ఒక్కో సన్నివేశం ఒళ్లు గగుర్పొడిచేలా ఉన్నాయి. దాంతో టీజర్ కూడా ఆడియన్స్ కు తెగ నచ్చేసింది. టీజర్ లో వచ్చే ‘చంపితే తప్పు కానీ, బలిస్తే తప్పేంటి’ అనే చివరి డైలాగ్ సినిమాపై హైప్ పెంచుతున్నాయి. అనిల్ డైరెక్షన్ లో, శ్రీకృష్ణ క్రియేషన్స్ బ్యానర్ పై సినిమా తెరకెక్కింది.