ఫ్యాన్స్ గెట్ రెడీ.. 90 సెక్లన్ల బీభత్సంతో.. సలార్ టీజర్ రెడీ..!
X
డార్లింగ్ ఫ్యాన్స్ కు పూనకాలు తెప్పించే క్రేజీ అప్ డేట్ రాబోతోంది. ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న సలార్ సినిమా ఫస్ట్ గ్లింప్స్ ను చిత్ర బృదం రెడీ చేస్తోంది. బాహుబలి, సాహో లాంటి యాక్షన్ సినిమాల తర్వాత ప్రభాస్ నుంచి రాబోతున్న సినిమా సలార్. ప్రశాతం నీల్ డైరెక్షన్ లో రాబోతున్న ఈ సినిమాపై డార్లింగ్ ఫ్యాన్స్ పెద్ద ఆశలు పెట్టుకున్నారు. అందుకే ఈ సినిమాకు సంబంధించి ఏ చిన్న న్యూస్ అయినా సెన్ సేషన్ అవుతుంది. అంతేకాకుండా సోషల్ మీడియాలో వస్తున్న వార్తల ప్రకారం ఈ సినిమా టీజర్.. జులై 7న విడుదల కానుంది.
ప్రస్తుతం టీజర్ అధికారిక ప్రకటన చేశారు మూవీ టీం. ఈ సినిమా టీజర్ ను జులై 6న ఉదయం 5:12 గంటలకు విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. టీజర్ తో పాటు మరో పోస్టర్ కూడా విడుదల కానుంది. ఆదిపురుష్ సినిమా డిజాస్టర్ తర్వత ప్రభాస్ ఫ్యాన్స్ అంతా సలార్, ప్రాజెక్ట్ కెపైనే ఆశలు పెట్టుకున్నారు.