Home > సినిమా > మ్యూజిక్ బ్యాక్‌డ్రాప్‌తో వస్తోన్న 'నీదారే నీ కథ'.. టీజర్ రిలీజ్

మ్యూజిక్ బ్యాక్‌డ్రాప్‌తో వస్తోన్న 'నీదారే నీ కథ'.. టీజర్ రిలీజ్

మ్యూజిక్ బ్యాక్‌డ్రాప్‌తో వస్తోన్న నీదారే నీ కథ.. టీజర్ రిలీజ్
X

టాలీవుడ్‌లో చిన్న సినిమాలు విడుదలై సంచలనం సృ‌ష్టిస్తున్నాయి. కొత్త టాలెంట్‌కు తెలుగు చిత్ర పరిశ్రమ ఎప్పుడూ వెల్‌కమ్ చెబుతూనే ఉంటుంది. తాజాగా అటువంటి కాస్టింగ్‌తో వస్తున్న చిత్రం 'నీదారే నీకథ'. దర్శకుడు వంశి జొన్నలగడ్డ ఈ మూవీతో తెలుగు ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. జేవీ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఈ మూవీ రూపొందుతోంది. ఈ మూవీని తేజేష్ వీర, శైలజ జొన్నలగడ్డ, హర్షిత తోట సంయుక్తంగా నిర్మిస్తున్నారు. యూత్‌ను ఆకట్టుకునే కథాంశంతో ఈ మూవీ తెరకెక్కుతోంది. నేడు ఈ మూవీ టీజర్ లాంచ్ ఈవెంట్ జరిగింది.

మ్యూజిక్ బ్యాక్‌డ్రాప్‌తో రూపొందుతోన్న 'నీదారే నీకథ' మూవీ టీజర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. తెలుగు ఫిలిం జర్నలిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ లక్ష్మీనారాయణ, క్రిటిక్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సురేష్ చేతుల మీదుగా ఈ మూవీ టీజర్ లాంచ్ ఈవెంట్ జరిగింది. సింక్ సౌండ్‌తో సాగే మ్యూజిక్ అద్భుతంగా ఉంది. త్వరలోనే ఈ మూవీ రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేస్తామని మేకర్స్ తెలిపారు.

టీజర్ లాంచ్ ఈవెంట్ సందర్భంగా నిర్మాత శైలజ జొన్నలగడ్డ మాట్లాడుతూ.. సినిమా మీద ఉన్న ప్యాషన్‌తో సినిమా నిర్మించామన్నారు. బుడాపెస్ట్‌లో చేసిన మ్యూజిక్ ఆర్కెస్ట్రా థీమ్ సినిమాకి హైలైట్‌గా నిలుస్తుందన్నారు. బాలీవుడ్ మ్యూజిషియన్స్‌తో పాటలు చేశామన్నారు. దర్శకుడు వంశీ జొన్నలగడ్డ మాట్లాడుతూ.. న్యూయార్క్‌లో డైరెక్షన్ కోర్సు చేసి తెలుగువాళ్లకు నచ్చేవిధంగా సినిమా చేస్తున్నామన్నారు. ఈ మూవీలో సినిమా కథనే ఎంజాయ్ చేయకుండా మ్యూజిక్‌ని కూడా ఎక్స్‌పీరియన్స్ చేస్తారని, ఫీల్ గుడ్‌గా అనిపిస్తుందన్నారు.

ఈమధ్యనే హైదరాబాదులోని నెక్సస్ మాల్‌లో ఈ మూవీ యూనిట్ పరిచయ కార్యక్రమం జరిగింది. ఏఆర్ రెహమాన్ ఫౌండేషన్ ద్వారా 30 మంది యువ సంగీత వాయిద్య కళాకారులు లైవ్ ఆర్కెస్ట్రాతో మ్యూజికల్ ఫ్లాష్ మాబ్ ఇచ్చారు. నీదారే నీకథ మూవీ టీమ్ లైవ్ ఈవెంట్ ద్వారా అందర్నీ ఉర్రూతలూగించింది. త్వరలోనే ఈ మూవీ థియేటర్లలోకి రానుందని మేకర్స్ ప్రకటించారు.

Updated : 20 March 2024 6:41 PM IST
Tags:    
Next Story
Share it
Top