Home > సినిమా > అదరగొడుతున్న చిరంజీవి తీనుమార్ సాంగ్

అదరగొడుతున్న చిరంజీవి తీనుమార్ సాంగ్

అదరగొడుతున్న చిరంజీవి తీనుమార్ సాంగ్
X

మెగాస్టార్ చిరంజీవి భోళా శంకర్ విడుదలకు సిద్ధమైంది. మెహర్ రమేష్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ అగస్ట్ 11న రిలీజ్ కానుంది. తమిళ చిత్రం వేదాళం రీమేక్గా వస్తున్న భోళా శంకర్ చిత్రం కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే రిలీజైన టీజర్, ట్రైలర్, పాటలు ఓ రేంజ్లో ఉండడంతో సినిమాపై అంచనాలు రెట్టింపయ్యాయి. తాజాగా ఈ మూవీ నుంచి విడుదలైన తీనుమార్ సాంగ్ అందరినీ ఆకట్టుకుంటుంది. మాస్ బీట్ కు చిరు తన స్టెప్పులతో దుమ్ములేపారు.





ఈ మూవీలో తమన్నా హీరోయిన్గా నటిస్తుండగా.. కీర్తి సురేష్ మెగాస్టార్ చెల్లెలుగా యాక్ట్ చేస్తోంది. హీరో సుశాంత్ ప్రత్యేక పాత్రలో కనిపించనున్నారు. ఈ మూవీకి మహతి స్వరసాగర్ సంగీతం అందించగా.. ఏకే ఎంటర్టైన్మెంట్స్‌ పతాకంపై రామబ్రహ్మం సుంకర ఈ మూవీని నిర్మిస్తున్నారు. మరోవైపు ఈ చిత్రం టిక్కెట్ రేటు పెంచడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రధానంగా ఏపీలో టికెట్‌పై రూ.25 పెంచాలని నిర్మాతలు భావిస్తున్నారు. ఇందుకు ఏపీ ప్రభుత్వం పర్మిషన్ కోరారు. దీనిపై వైసీపీ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో అని ఆసక్తి నెలకొంది.





Updated : 7 Aug 2023 10:00 PM IST
Tags:    
Next Story
Share it
Top