Navdeep Drugs Case : ఫోన్‌లో డేటా డిలీట్ చేసిన నవదీప్.. ఇక జరగబోయేది ఇదే
X
మాదాపూర్ డ్రగ్స్ కేసులో తెలంగాణ నార్కోటిక్స్ బ్యూరో (టీ న్యాబ్) పోలీసుల విచారణ వేగవంతంగా సాగుతోంది. హైకోర్టు ఆదేశాలతో టాలీవుడ్ నటుడు నవదీప్‌కు నోటీసులు జారీ చేయగా.. శనివారం ఆయన టీ న్యాబ్ ఆఫీస్‌లో శనివారం విచారణకు హాజరయ్యారు. టీ న్యాబ్ ఎస్పీ సునీతారెడ్డి, ఏసీపీ నర్సింగ్‌రావు, ఇన్‌స్పెక్టర్ రాజేష్ బృందం నవదీప్‌ను విచారించింది. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ప్రశ్నించారు.
అయితే విచారణలో తాము అడిగిన ప్రశ్నలన్నింటికి సమాధానాలు చెప్పాడని నార్కోటిక్ బ్యూరో ఎస్పీ సునీతారెడ్డి తెలిపారు. ఈ కేసులో 81 లింక్‌లు( 81 మంది అనుమానితులు) గుర్తించారని అన్నారు. అందులో 41 మంది గురించి తనకు తెలిసిన వివరాలను తెలిపాడని వివరించారు. అతను డ్రగ్స్ వాడకం గురించి అడిగితే.. గతంలో వినియోగించారని.. సిట్, ఈడీ విచారణలో చెప్పిన విషయాన్ని చెప్పారన్నారు. ప్రస్తుతం మాత్రం డ్రగ్స్ వాడలేదని సమాధానమిచ్చాడని అన్నారు. ఈడ్రగ్స్ కేసులో నవదీప్‌కు తన స్నేహితుడు రామ్‌చంద్‌తో ఉన్న సంబంధాలపై ప్రశ్నించామన్నారు. దానికి సమాధానంగా నవదీప్(Navdeep) గతంలో వారు కలిసి బీపీఎం పబ్ నిర్వహించారన్నారు.
అయితే నవదీప్ విచారణలకు తన ఫోన్ తీసుకురాకపోవడంపై ఆరా తీశారు అధికారులు. విచారణలో ఫోన్ ఎక్కడ అని అడగ్గా.. రిపేర్ అయినట్లు నవదీప్ చెప్పారు. దీంతో ఇంటికి వెళ్లి ఫోన్ తీసుకువచ్చి పరిశీలించగా.. మొబైల్‌ను ఫార్మాట్ చేసి డేటా మొత్తం డిలీట్ చేసినట్లు గుర్తించారు. అతని ఫోన్ రీట్రైవ్ చేసి మళ్లీ విచారిస్తామని సునీతారెడ్డి స్పష్టం చేశారు. ఇక విచారణ అనంతరం మీడియాతో మాట్లాడిన నవదీప్.. ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేశాడు. నోటీసులు ఇవ్వడంతో నార్కోటిక్స్ ఆఫీసుకు వచ్చానని , రాం చందర్ అనే వ్యక్తితో తనకు పరిచయం ఉన్న మాట వాస్తవమేనన్నారు. తాను ఎక్కడా డ్రగ్స్ తీసుకోలేదని, గతంలో ఓ పబ్ నిర్వహించినందుకే తనను పిలిచి ప్రశ్నించారని చెప్పారు. గతంలో సిట్, ఈడీ విచారిస్తే ఇప్పుడు తెలంగాణ నార్కోటిక్స్ బ్యూరో ప్రశ్నిస్తోందని చెప్పారు