Jai Bheem : నాని గుండె పగిలింది.. జై భీమ్‌పై పోస్ట్ వైరల్
X
జాతీయ చలన చిత్ర అవార్డులపై ఒక ప్రశంసలు, మరో పక్క విమర్శలు వెల్లువెత్తున్నాయి. బీజేపీకి అనుకూలంగా ఉన్న వారి చిత్రాలకే అవార్డులు వచ్చాయని, ‘కశ్మీర్ ఫైల్స్’ చిత్రానికి అవార్డు రావడం దీనికి నిదర్శనమని కొందరు అంటున్నారు. జాతీయ ఉత్తమ నటుడిగా ‘పుష్ప’ అర్జున్ అర్జున్‌ను ఎంపిక చేయడంపైనా విమర్శలు వస్తున్నాయి. లాబీయింగ్ జరిగిందని, ఒక స్మగ్లర్ పాత్ర పోషించిన నటుడికి ఆ పురస్కారం ఎలా ఇస్తారని కొందరు ప్రశ్నిస్తున్నారు. అయితే పాత్ర ఎలాంటిదైనా పెర్షామన్స్ మాత్రమే గీటురాయి అని కొందరు తిప్పికొడుతున్నారు. మరోపక్క.. తమిళ నటుడు సూర్య లాయర్‌గా నటించిన ‘జై భీమ్’ చిత్రానికి అవార్డు ఎందుకివ్వలేదనే ప్రశ్నలు వస్తున్నాయి. దళితులపై తీసిన సినిమా కాబట్టే దానికి అవార్డు రాలేదని అంటున్నారు.
ఈ వివాదంపై తెలుగు యువ కథానాయకుడు నాని కూడా స్పందించారు. ఎలాంటి వ్యాఖ్యలూ చేయకుండా తన మనసులో ఉన్నది ఒక మాటతో, ఒక బొమ్మతో బయటపెట్టాడు. తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ‘జైభీమ్’ అని రాసి పక్కన పగిలిపోయిన గుండె బొమ్మను పెట్టారు. దీంతో అది వైరల్ అయింది. సూర్య చిత్రానికి అవార్డు రాకపోవడంతో తన హృదయం ముక్కలైందని ఆయన ఉద్దేశం. గురువారం ప్రకటించిన జాతీయ చలన చిత్ర అవార్డులో ఉత్తమ చిత్రంగా ‘రాకెట్రీ: ద నంబి ఎఫెక్ట్’ సినిమా ఎంపికైంది. తమిళం నుంచి ఉత్తమ చిత్రంగా ‘కదైసి వివసాయి’ ఎంపికపైంది. జై భీమ్ చిత్రానికి మంచి ఆదరణ వచ్చినా సూర్యకు ‘సూరారై పోట్టు’(2020) చిత్రానికిగాను ఉత్తమ నటుడిగా అవార్డు ఇచ్చి ఉండడంతో ఈసారి మరొకరికి ఇవ్వాలని జ్యూరీ నిర్ణయించి ఉండొచ్చని చెబుతున్నారు.