Home > సినిమా > క్రేజ్ మామూలుగా లేదుగా.. హనుమాన్ కూడా తగ్గేదేలే

క్రేజ్ మామూలుగా లేదుగా.. హనుమాన్ కూడా తగ్గేదేలే

క్రేజ్ మామూలుగా లేదుగా.. హనుమాన్ కూడా తగ్గేదేలే
X

సంక్రాంతి సీజన్ అనగానే టాలీవుడ్ ప్రేక్షకులకు పండగే. వరుసగా చిన్నాపెద్దా సినిమాలన్నీ రిలీజ్ అవుతుంటాయి. బాక్సాఫీస్ వద్ద పోటీ పడుతుంటాయి. వరుస సెలవులు కావడంతో.. అభిమానులు కూడా థియేటర్లకు క్యూ కడుతుంటారు. ఈ సీజన్ ను క్యాష్ చేసుకోవడానికి మేకర్స్ గట్టిగా ప్లాన్ చేస్తూ ఉంటారు. అందులో భాగంగానే ఈ ఏడాది కూడా సంక్రాంతికి భారీగా సినిమాలు విడుదలవుతున్నాయి. అందులో భాగంగానే మహేశ్ బాబు గుంటూరు కారం, వెంకటేశ్ సైంధవ్, రవితేజ ఈగల్, నాగార్జున నా సామిరంగా సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ఇవన్నీ ఒక ఎత్తైంతే.. కొత్త హీరో తేజ సజ్జా, కొత్త డైరెక్టర్ ప్రశాంత్ వర్మ కాంబినేషన్స్ లో వస్తున్న హనుమాన్ సినిమా కూడా తగ్గేదేలే అంటూ సంక్రాంతి బరిలో నిలిచింది.

కాగా ఈ బరిలో గెలిచేది మాత్రం గుంటూరు కారమే అని విశ్లేషకులు మొన్నటి వరకు అన్నమాట. గుంటూరు కారం నిర్మాత నాగవంశీ కూడా ఇదే విషయాన్నీ పదే.. పదే చెప్పుకొచ్చాడు. అయితే ఆడియన్స్ ఇంట్రెస్ట్ మాత్రం వేరేలా ఉందని అర్థం అవుతుంది. పెద్ద హీరో, పెద్ద సినిమా అని కాకుండ.. చాలామంది హనుమాన్ సినిమా గురించే ఎక్కువగా వెయిట్ చేస్తున్నారట. ఆ సినిమా రిలీజ్ అయిన టీజర్, గ్లింప్స్ కే ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు. ఇక డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ప్రకటించిన ఇండియన్ సూపర్ హీరో సినిమాటిక్ యూనివర్స్ లోని మొదటి సినిమా కావడంతో.. ప్రేక్షకుల్లో ఆ హైప్ మరింత పెరిగిపోయింది. హనుమాన్ చిత్ర బృదం కూడా ఆ రేంజ్ లోనే ప్రమోషన్స్ చేస్తుంది.

బుక్ మైషో లెక్కలు కూడా హనుమాన్ కే మొగ్గు చూపిస్తున్నాయి. హనుమాన్, గుంటూరు కారం మధ్య గట్టి పోటీ ఉంటుందని చెప్తుంది. బుక్ మై షోలో హనుమాన్ సినిమాపై 179.8k ఇంట్రెస్ట్ చూపిస్తుంటే గుంటూరు కారం సినిమాపై 179.5k చూపిస్తున్నారు. మహేశ్ బాబు లాంటి సూపర్ స్టార్ సినిమానే దాటేసిందంటే.. ఈ సినిమా ఎలా ఉంటుందని అభిమానుల్లో ఉత్సాహం రెట్టింపైంది. సినిమాలో ఉండాల్సింది కటౌట్ కాదు కంటెంట్ అంటూ పలువురు అంటున్నారు. ఇక సంక్రాంతి రేసులో ఏ సినిమా టాప్ లో నిలుచుంటుందో చూడాలి.

Updated : 4 Jan 2024 7:00 AM GMT
Tags:    
Next Story
Share it
Top