బిగ్ బాస్ సీజన్ 7.. అంతా ఉల్టా పుల్టా.. వీడియో
X
తెలుగు బిగ్‌బాస్ సీజన్ 7 హంగామా ఎక్కువైంది. ఎప్పట్లాగే సీనియర్ నటుడు అక్కినేని నాగార్జున వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ఈ సీజన్ కోసం ప్రచారం ముమ్మురం చేశారు. తాజాగా గురువారం మరో ప్రోమో వదిలారు. ఆకట్టుకునే రెస్క్యూ ఆపరేషన్‌కు ట్విస్ట్ ఇచ్చి చిత్రంగా ముగించారు. మనం ఊహించనవే జరిగితే థ్రిల్ ఉండదని, మొత్తం వెరైటీగా ఉండాలనే థీమ్‌తో దీన్ని వదిలారు. రమేశ్, రాధ అనే ప్రేమజంటతో ఈ బిట్ తీశారు. రమేశ్ పెద్ద కొండమీది నుంచి పడిపోతూ చిన్న రాయిముక్క ఆసరా పట్టుకుని వేలాడుతుంటడు. కొండమీదున్న రాధ తన చుట్టీ వేసి పట్టుకోమంటుంది. రమేశ్ చున్నీనీ పట్టుకుని పైకెక్కబోతుండగా నాగ్ పక్కనే ప్రత్యక్షమవుతాడు. ‘‘ఇలాంటి క్లైమాక్స్‌లు మనం బోలెడు చూశాం కదా, ఎండింగే మార్చేద్దాం.. ఇది అంతం కాదు ఆరంభం’’ అంటాడు. తర్వాత రాధకు పెద్ద తుమ్ము వచ్చి హాచ్చ్ అని తమ్ముతుంది. చున్నీ జారిపోయి రమేశ్ పడిపోతాడు కింద పడిపోతాడు. తర్వాత నాగ్ ‘‘అంతా ఉల్టా పుల్టా’’ అంటారు.
సీజన్ 6 అట్టర్ ప్లాప్ కావడంతో 7ను మొత్తం ప్లాన్ మార్చి రంగంలోకి దిగుతున్నారు. సెప్టెంబర్ 3న షో ప్రారంభం కావొచ్చని చెబుతున్నారు. సెలబ్రిటీలను రంగంలోకి దించడానిక ప్రయత్నాలు సాగుతున్నాయని అయితే రెమ్యునేషన్ విషయంలో పంచాయతీలు తెగడం లేదని టాక్. మొత్తానికి టైమ్ దగ్గర పడుతుండడంతో వర్ష, బుల్లెట్ భాస్కర్, ప్రభాకర్, అమర్‌దీప్, బ్యాంకాక్ పిల్ల, శోభా శెట్టి మోహన భోగరాజు, సాకేత్, అమర్‌దీప్ వంటివారితో లాగించున్నట్లు తెలుస్తోంది. గత సీజన్లలో గ్లామర్ బొమ్మల మంత్రం పనిచయకపోడంతో పక్కా మాస్, పక్కా కామెడీ పీసులను రంగంలోకి దించనున్నట్లు టాక్. యూట్యూబ్, ఇన్‌స్టా వంటి సోషల్ మీడియాలో రచ్చ చేసేవాళ్లు కాకుండా జనానికి కాస్తా బాగా తెలిసిన వాళ్లను తీసుకుంటున్నారని చెబుతున్నారు.