Rachna Banerjee : లోక్ సభ బరిలో టాలీవుడ్ హీరోయిన్ రచన బెనర్జీ.. టికెట్ ఇచ్చిన దీదీ
X
తెలుగులో ఒకప్పుడు హీరోయిన్‌గా చేసి, ఇప్పుడు సీరియల్స్‌లో నటిస్తున్న నటి రచన బెనర్జీకి లోక్ సభ ఎన్నికల్లో టికెట్ దక్కింది. టాలీవుడ్‌లో బావగారు బాగున్నారా, కన్యాదానం, మావిడాకులు, సినిమాల్లో నటించింది.రచనా తెలుగు, తమిళ, కన్నడ, బెంగాలీ, ఒరియా భాషల్లో పలు చిత్రాల్లో నటించింది. నటి రచనా బెనర్జీ హుగ్లీ నుంచి పోటీ చేయనున్నారని తెలిపారు. అక్కడ ఆమె బెంగాలీ పరిశ్రమకు చెందిన మరో నటిపై పోటీ చేయనున్నారు. లాకెట్ ఛటర్జీ ఇదే నియోజకవర్గం నుంచి భారతీయ జనతా పార్టీతరపున పోటీ చేస్తున్నారు. ఒక వారం క్రితం, సీఎం మమతా బెనర్జీ.. రచన ప్రముఖ రియాలిటీ షో దీదీ నంబర్ 1 లో కనిపించారు. ప్రత్యేక ఎపిసోడ్ మార్చి 3 న ప్రసారం చేశారు. ఆ ఎపిసోడ్‌లో మమత ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు.
తన కార్యక్రమానికి ముఖ్యమంత్రిని ఆహ్వానించేందుకు రచన స్వయంగా మమత వద్దకు వెళ్లారు. అప్పటి నుంచి రచన రాజకీయాల్లోకి వస్తున్నారనే వదంతులు వ్యాపించడం మొదలయ్యాయి. తన రాజకీయ రంగ ప్రవేశంపై ఏదైనా నిర్ణయం తీసుకుంటే ఆ విషయాన్ని స్వయంగా సీఎం ప్రకటిస్తారని ఆమె మీడియాకు తెలిపారు. నబన్నాలో దీదీని కలిసిన కొన్ని రోజుల తర్వాత, హౌరాలోని తిలజలా స్టేడియంలో సీఎంతో కలిసి దీదీ నంబర్ 1 స్పెషల్ ఎపిసోడ్‌ని చిత్రీకరించారు.మొత్తం 42 లోక్‌సభ స్థానాలకూ అభ్యర్థులను నిలబెట్టనున్నట్లు ప్రకటించిన వెంటనే మమత బెనర్జీ.. ఈ జాబితాను విడుదల చేశారు. కోల్‌కతలో ఎన్నికల ప్రచార సభలను ప్రారంభించారు మమత బెనర్జీ. బ్రిగేడ్ పరేడ్ గ్రౌండ్స్‌లో నిర్వహించిన భారీ బహిరంగ సభను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ ఎన్నికల్లో ఎవ్వరితోనూ పొత్తులు లేవని తేల్చి చెప్పారు. ఒంటరిగా పోరాడబోతోన్నామని స్పష్టం చేశారు.ఈ జాబితాలో యూసుఫ్ పఠాన్‌తో పాటు సిట్టింగ్ ఎంపీ మహువా మొయిత్ర పేర్లు ఉన్నాయి. యూసుఫ్ పఠాన్- బహ్రాంపూర్, మహువా మొయిత్ర- కృష్ణానగర్ సీట్లు ఖరారయ్యాయి. మరో సిట్టింగ్ ఎంపీ మిమి చక్రవర్తికి టికెట్ దక్కలేదు. అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్‌కు భారీ మెజారిటీ లభించడానికి గల కారణాల్లో ఒకటైన ఖేలో హొబె పాటను పాడిన గాయకుడు దేబాన్షు భట్టాచార్యకు టికెట్ ఇచ్చారు.