Home > సినిమా > ఈ వారం థియేటర్‌/ఓటీటీలలో విడుదలయ్యే తెలుగు సినిమాలివే

ఈ వారం థియేటర్‌/ఓటీటీలలో విడుదలయ్యే తెలుగు సినిమాలివే

ఈ వారం థియేటర్‌/ఓటీటీలలో విడుదలయ్యే తెలుగు సినిమాలివే
X

గత వారం తమిళ, తెలుగు ఇండస్ట్రీలకు చెందిన అగ్ర హీరోల సినిమాలు బాక్సాఫీస్‌ వద్ద విడుదల కాగా.. అందులో ఒకటి మాత్రం కలెక్షన్ల పరంగా దూసుకెళ్తోంది. ఇక ఈ వారం మాత్రం అన్ని సినిమాలే థియేటర్లలో ప్రేక్షకులను మెప్పించేందుకు వస్తున్నాయి. మరి ఈ వారం అటు థియేటర్‌, ఇటు ఓటీటీలో వస్తున్న చిత్రాలేంలో ఓసారి చూసేద్దామా..!

మిస్టర్ ప్రెగ్నెంట్

సయ్యద్‌ సొహైల్‌, రూపా కొడువయూర్‌ జంటగా శ్రీనివాస్‌ వింజనంపాటి తెరకెక్కించిన చిత్రం ‘మిస్టర్‌ ప్రెగ్నెంట్‌’ (mr pregnant). అప్పిరెడ్డి, రవిరెడ్డి సజ్జల సంయుక్తంగా నిర్మించారు. సుహాసిని, అలీ, బ్రహ్మాజీ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా ఆగస్టు 18న ప్రేక్షకుల ముందుకు రానుంది. ‘ఇది సంక్లిష్టమైన కథ. ప్రసవం కోసం అమ్మ పడే కష్టాన్ని తీసుకున్న ఓ నాన్న కథ ఇది’ అని చిత్ర బృందం తెలిపింది.

ప్రేమ్ కుమార్

సంతోష్‌ శోభన్‌ హీరోగా నటించిన ‘ప్రేమ్‌కుమార్‌’ కూడా 18 వ తేదీనే విడుదల కానుంది. రాశిసింగ్‌, రుచిత సాదినేని హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాకు రచయిత అభిషేక్‌ మహర్షి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. సారంగ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై శివప్రసాద్‌ పన్నీరు నిర్మిస్తున్నారు.

‘జిలేబి’

‘నువ్వు నాకు నచ్చావ్‌’, ‘మల్లీశ్వరి’ వంటి వినోదాత్మక చిత్రాలతో ప్రేక్షకుల్ని మెప్పించారు దర్శకుడు కె.విజయభాస్కర్‌. ఆయన తన కుమారుడు శ్రీ కమల్‌ను హీరోగా పరిచయం చేస్తూ తెరకెక్కించిన చిత్రం ‘జిలేబి’ (jilebi movie). శివానీ కథానాయిక. రాజేంద్రప్రసాద్‌ కీలక పాత్ర పోషించారు. గుంటూరు రామకృష్ణ నిర్మాత. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఆగస్టు 18న థియేటర్‌లలో విడుదల కానుంది.

భూతాల బంగ్లా

తమిళ నటుడు సంతానం కీలక పాత్రలో నటించిన హారర్‌ కామెడీ మూవీ ‘డీడీ రిటర్న్స్‌ భూతాల బంగ్లా’ (dd returns bhootala bungalow). ఇప్పటికే తమిళంలో విడుదలై మంచి టాక్‌ అందుకున్న ఈ సినిమా ఆగస్టు 18న తెలుగులోనూ విడుదల కానుంది.

‘పిజ్జా 3’

సక్సెఫుల్‌ హారర్‌ థ్రిల్లర్‌ ఫ్రాంఛైజీ ‘పిజ్జా’ సిరీస్‌లో రాబోతున్న మరో కొత్త సినిమా ‘పిజ్జా3’ (Pizza 3). ఈ సినిమా కూడా ఇటీవల తమిళంలో విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. అశ్విన్‌ కాకుమణి, పవిత్ర మరిముత్తు ప్రధాన పాత్రల్లో మోహన్‌ గోవింద్‌ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఆద్యంతం హారర్‌ థ్రిల్లింగ్‌ ఎక్స్‌పీరియన్స్‌ను ఇచ్చేలా సినిమాను తీర్చిదిద్దినట్లు ఇటీవల విడుదల చేసిన ప్రచార చిత్రం చూస్తే అర్థమవుతోంది.

ఈ వారం ఓటీటీలో వస్తున్న తెలుగు సినిమా ఒక్కటే..

ఈటీవీ విన్‌

అన్నపూర్ణా ఫొటో స్టూడియో (ఆగస్టు 15)









Updated : 14 Aug 2023 1:52 PM IST
Tags:    
Next Story
Share it
Top