Home > సినిమా > వాలంటైన్స్ డే స్పెషల్.. 4 సినిమాలు రీరిలీజ్

వాలంటైన్స్ డే స్పెషల్.. 4 సినిమాలు రీరిలీజ్

వాలంటైన్స్ డే స్పెషల్.. 4 సినిమాలు రీరిలీజ్
X

ప్రేమికుల రోజంటే కేవలం గిఫ్టులు ఇచ్చుకోవడం, గ్రీటింగ్స్ చెప్పుకోవడమే కాదు.. మనసుకు నచ్చినవారితో టైం స్పెండ్ చేసి.. ఆ రోజును ఎప్పటికీ గుర్తుండేలా ప్లాన్‌ చేసుకుంటారు ప్రేమికులు. ఆ ప్రత్యేకమైన రోజును మరింత స్పెషల్‌గా మార్చుకునేందుకు ప్రేమకథా సినిమాలుంటే బాగుంటుంది. గతంలో అలరించిన సినిమాలైతే మరీ బాగుంటుంది. అందుకే మరోసారి వినోదాన్ని పంచేందుకు సిద్ధమయ్యాయి. ఏకంగా నాలుగు సూపర్‌ హిట్‌ ప్రేమకథా సినిమాలు వాలంటైన్స్ డే రోజున.. రీరిలీజ్‌కు రెడీ అయ్యాయి అవేంటంటే..

సిద్ధార్థ్ ‘ఓయ్’:

ఆనంద్ రంగ డైరెక్షన్ లో తెరకెక్కిన సినిమా ఓయ్. 2009, జులై 3న రిలీజ్ అయిన ఈ సినిమా ప్రేమికులకు ఎప్పటికీ ప్రత్యేకమే. ఈ సినిమాలో సిద్ధార్థ్ సరసన షామిలీ నటించింది.

రీసెంట్ హిట్ సీతారామం:

యుద్ధంతో రాసిన ప్రేమకథా అంటూ.. ప్రేక్షకులను కంటతడి పెట్టించి సీతారామం సినిమా రీరిలీజ్ కు రెడీ అయింది. రామ్‌గా దుల్కర్ సల్మాన్, సీతగా మృణాల్ ఠాకూర్ వారి నటనతో మేజిక్‌ చేశారు.

రెండోస్సారి:

సూర్య సన్నాఫ్ కృష్ణన్.. ఈ సినిమా 90s యూత్ కు ప్రత్యేకం. స్టార్ హీరో సూర్య నటించిన ఈ ఫీల్ గుడ్ లవ్ స్టోర్ లో సిమ్రన్, సమీరా రెడ్డి, దివ్యా శ్రీపాద నటించారు. గౌతమ్ మేనన్ డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమా 2008లో రిలీజ్ అయింది. ఇప్పటికే ఈ సినిమా రీరిలీజ్ కాగా.. వాలంటైన్స్ డే సందర్భంగా మరోసారి విడుదల చేస్తున్నారు.

క్లాసిక్ హిట్ 96:

96 సినిమా ఓ క్లాసిక్ లవ్ స్టోరీ. ఈ తమిళ్ సినిమాను తెలుగులో ‘జాను’గా రీమేక్ చేశారు. తమిళ్ లో విజయ్ సేతుపతి, త్రిష నటించగా.. తెలుగులో శర్వానంద్, సమంత నటించారు. ఇప్పుడు మరోసారి ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది.

వీటితో పాటు పవన్ కళ్యాణ్ నటించిన తొలిప్రేమ కూడా రెండోసారి రీరిలీజ్ కానున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. సిద్ధార్థ్, త్రిష నటించిన నువ్వొస్తానంటే నేనొద్దంటానా... శర్వానంద్, జై, అనన్య, అంజలి నటించిన జర్నీ సినిమా కూడా వస్తున్నట్లు తెలుస్తుంది. అయితే వీటిపై ఏ క్లారిటీ లేదు. ఈ అప్ డేట్ కోసం సినీ ప్రియులంతా ఎదురుచూస్తున్నారు.

Updated : 10 Feb 2024 9:00 PM IST
Tags:    
author-thhumb

Kiran

కిరణ్.. జర్నలిజంలో 15ఏండ్ల అనుభవం ఉంది. ప్రస్తుతం Mic Tv Websiteలో Shift Inchargeగా పనిచేస్తున్నారు. గతంలో, ఈటీవీ -2, టీ న్యూస్, V6 న్యూస్ ఛానళ్లలో పని చేశారు. తెలంగాణ, ఏపీ రాజకీయాలు, జాతీయ, అంతర్జాతీయ, బిజినెస్, సినిమాలకు సంబంధించిన వార్తలు, విశ్లేషణలు రాయగలరు.


Next Story
Share it
Top