CM Revanth Reddy : పద్మఅవార్డు గ్రహీతలకు భారీగా నగదు ప్రకటన...ఎంతో తెలుసా!
X
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పద్మశ్రీ గ్రహీతలకు రూ. 25 లక్షల నగదు పురస్కరాన్ని అందిస్తున్నట్లు తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి. అంతేగాక కవులు, కళాకారులకు ప్రతీ నెల వారి ఖర్చుల కోసం 25 వేల పెన్షన్ ఇవ్వనున్నట్లు చెప్పారు. ఈ సందర్భంగా శిల్పకళావేదికలో ఏర్పాటు చేసిన పద్మఅవార్డు గ్రహీతలకు సన్మాన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. తెలుగు వాళ్లు ఎక్కడున్నా మనవాళ్లే అన్నారు. మట్టిలో మాణిక్యాలను కేంద్ర ప్రభుత్వం గుర్తించి అవార్డులు ఇవ్వడం సంతోషంగా ఉందని చెప్పారు.
అవార్డు మట్టిలో మాణిక్యాలను వెలికి తీస్తుందని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల వారిని మరింత ప్రోత్సాహిస్తామని చెప్పుకొచ్చారు. పద్మశ్రీ అవార్డు గ్రహీతలను సన్మానించుకొవడం మన బాధ్యత అని గుర్తు చేశారు. వెంకయ్యనాయుడుని సన్మానించడం అంటే మనల్ని మనం సన్మానించుకున్నట్లే అన్నారు. ఒక తెలుగువాడిగా వెంకయ్యనాయుడు త్వరలో రాష్ట్రపతి కావాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. నటనలో కమిట్మెంట్ ఉన్న గొప్ప వ్యక్తి చిరంజీవి అని కొనియాడారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో చిరంజీవి ఎంతో గుర్తింపు తెచ్చుకున్నారని చెప్పారు. ఈ కార్యక్రమం రాజకీయాలకు అతీతమని తేల్చి చెప్పారు. సాంప్రదాయాలను కాపాడుకోవాల్సి వచ్చినప్పుడు అంతా ఏకం కావాలని రేవంత్ రెడ్డి సూచించారు.