Home > సినిమా > షాక్ ఇచ్చిన స్టార్ హీరో కొడుకు..

షాక్ ఇచ్చిన స్టార్ హీరో కొడుకు..

షాక్ ఇచ్చిన స్టార్ హీరో కొడుకు..
X

తమిళ స్టార్ హీరో దళపతి విజయ్‌ని కొత్తగా పరిచయం చేయాల్సిన పని లేదు. తమిళ నటుడే అయినప్పటికీ డబ్బింగ్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు. ఆయన హీరోగా నటించిన చాలా వరకు సినిమాలు తెలుగు ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యాయి. తెలుగు రాష్ట్రాల్లో ఆయనకు ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఎక్కువే. సోషల్ మీడియాలోనూ ట్రోల్స్‎తో ఎప్పటికప్పుడు ట్రెండింగ్‎లోనే ఉంటారు. ఇండస్ట్రీకి వచ్చి 30 ఏళ్లు అవుతున్నా ఇండస్ట్రీలో కుర్ర హీరోలకు గట్టి పోటీ ఇస్తుంటారు విజయ్. ఈయనకు 23 ఏళ్ల కొడుకు ఉన్నాడు. అయితే నిజానికి విజయ్ కొడుకు తండ్రిలాగే హీరో అవుతాడనుకుని ఫ్యాన్స్ అందరూ ఎక్స్‌పెక్ట్ చేశారు. అయితే డైరెక్టర్‌గా తొలి ప్రాజెక్ట్‎ను అనౌన్స్ చేసి అందరికీ షాక్ ఇచ్చాడు.





దళపతి విజయ్‌కి ఇద్దరు పిల్లలు. ఇద్దరిలో పెద్దవాడైన జేసన్ సంజయ్ తండ్రిలానే హీరో అవుతాడని చాలారోజులుగా కోలీవుడ్‎లో టాక్ నడుస్తోంది. 'ఉప్పెన' తమిళ రీమేక్‌తో హీరోగా ఎంట్రీ ఇస్తారని నెట్టింట్లో రూమర్స్ కూడా తెగ వచ్చాయి. తాజాగా వాటన్నింటికీ ఫుల్‎స్టాప్ పెడుతూ..జేసన్ డైరెక్టర్‎గా ఎంట్రీ ఇస్తున్నాడు. తమిళ ఇండస్ట్రీలో భారీ బడ్జెట్ చిత్రాలను నిర్మిస్తున్న ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ విజయ్ కొడుకును దర్శకుడిగా పరిచయం చేస్తోంది. సోమవారం ఈ విషయాన్ని అధికారికంగా ట్విటర్ వేదికగా ప్రకటించింది. ఫొటోలను షేర్ చేసి అసలు మేటర్‎ను రివీల్ చేసింది.





బీస్ట్ సినిమాతో ఫ్లాప్‎ను మూటగట్టుకున్న విజయ్ మరింత ఎనర్జీతో లియోతో త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సినిమా తర్వాత వెంకట్ ప్రభుతో కలిసి ఓ చిత్రం చేయబోతున్నారు. ఆ తర్వాత ఇక కంప్లీట్‎గా సినిమాలకు బై బై చెప్పేసి రాజకీయాల్లోకి వెళతారని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇదే సమయంలో విజయ్ వారసుడు జేసన్ హీరోగా వస్తాడని ఫ్యాన్స్ అంచనాలు పెట్టుకుంటే.. డైరెక్టర్‎గా మారి షాకిచ్చాడు. మరి దళపతి ఫ్యాన్స్ కోరిక మేరకు బహుశా భవిష్యత్తులో ఏమైనా హీరో అయ్యే ఛాన్స్ ఏమైనా ఉందేమో చూడాల్సిందే.






Updated : 28 Aug 2023 6:21 PM IST
Tags:    
Next Story
Share it
Top