మిల్కీ బ్యూటీని పొగడ్తలతో ముంచేసిన ప్రియుడు..ఆమె నా ఐకాన్
X
టాలీవుడ్, బాలీవుడ్లో ప్రేమలు, పెళ్లిళ్ల హవా నడుస్తోంది. ఇన్నాళ్లు బ్యాచిలర్స్ గా మిగిలిపోయిన హీరోలు, హీరోయిన్లు తమ మనసుకు నచ్చినవారిని మనువాడుతూ కొత్త జీవితాన్ని ప్రారంభిస్తున్నారు. ఈ మధ్యనే టాలీవుడ్ యంగ్ స్టార్ శర్వానంద్ పెళ్లి చేసుకుని ఓ ఇంటివాడయ్యాడు. మెగా హీరో వరుణ్ తేజ్ 6 ఏళ్లుగా నటి లావణ్యతో జరుపుతున్న ప్రేమాయణానికి ఎంగేజ్మెంట్తో శుభం కార్డు పలికాడు, త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడు. లేటెస్టుగా స్టార్ హీరోయిన్ మిల్కీ బ్యూటీ తమన్నా కూడా అదే బాటలో నడుస్తోంది. ఈ మధ్యనే బాలీవుడ్ నటుడు విజయ్ వర్మతో తన రిలేషన్ గురించి పెదవి విప్పింది ఈ చిన్నది. విజయ్ వర్మ కూడా ఈ విషయంలో ఓపెన్ అయ్యాడు. త్వరలోనే ఈ ప్రేమజంట పెళ్లి చేసుకోబోతోందని బాలీవుడ్ కోడై కూస్తోంది. ఇదిలా ఉంటే తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో విజయ్ వర్మ్ తన ప్రేయసిని ఉద్దేశిస్తూ ఆసక్తికరమైన కామెంట్స్ చేశాడు. తమన్నాను పొగడ్తలతో ముంచేశాడు. ఆ కామెంట్స్ నెటిజన్లను అమితంగా ఆకట్టుకుంటున్నాయి.
రియల్ లైఫ్ లవ్ బర్డ్స్ తమన్నా-విజయ్ వర్మలు నటించిన వెబ్ సిరీస్ లస్ట్ స్టోరీస్2. ఈ మధ్యనే రిలీజ్ అయిన ట్రైలర్ ప్రేక్షకులను ఆకర్షిస్తోంది. ఈనెల 29న ఈ వెబ్ సిరీస్ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. ఈ నేపథ్యంలో నిర్మాణ సంస్త ప్రమోషన్లను మొదలు పెట్టేసింది. ఈ క్రమంలో విజయ్ వర్మ ఓ ఇంటర్వ్యూలో తమన్నాతో కలిసి పనిచేయడంపైన ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. " లస్ట్ స్టోరీస్ 2 కథ చదవగానే హీరోయిన్ ఎవరని అడిగాను. తమన్నా అని చెప్పడంతో సెలక్షన్ బాగుందని అనిపించింది. ఆ పాత్రకు తమన్నా పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. నిజానికి తన నటనతో మరింత గ్లామర్‌ను తీసుకువచ్చింది. ఏ పాత్ర అయినా సరే తమన్నా లోతుగా పరిశీలిస్తుంది. పాత్రకు తగ్గ న్యాయం చేస్తుంది. అలా తమన్నా మాత్రమే చేస్తుంది. కో యాక్టర్స్ యాక్టివ్‌గా ఉంటే షూట్ ఎంతో సరదాగా ఉంటుంది. ఆమె ఓ ఐకాన్ స్టార్. తమన్నా నటించిన బాహుబలి, బబ్లీ బౌన్సర్, సినిమాలు చేశాను. అందులో ఆమె నటన అద్భుతంగా లస్ట్ స్టోరీస్ 2 చూశాక మీరు ఆమెను తప్పకుండా ప్రశంసిస్తారు" అని విజయ్ వర్మ తమన్నాను పొగడ్తలతో ముంచేశాడు.