Home > సినిమా > విక్రమ్, పా రంజిత్ తంగలాన్ రిలీజ్ డేట్ వచ్చింది..

విక్రమ్, పా రంజిత్ తంగలాన్ రిలీజ్ డేట్ వచ్చింది..

విక్రమ్, పా రంజిత్ తంగలాన్ రిలీజ్ డేట్ వచ్చింది..
X

సౌత్ ఇండియాస్ మోస్ట్ అవెయిటెడ్ మూవీస్ లో ఒకటి తంగలాన్. పా. రంజిత్ దర్శకుడు కావడంతో ఈ మూవీపై మరింత అంచనాలు ఉన్నాయి. విక్రమ్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం కోలార్ గోల్డ్ ఫీల్డ్స్(కే.జి.ఎఫ్) నేపథ్యంలోని వాస్తవిక కోణాన్ని ఆవిష్కించబోతోన్న సినిమా అని ముందే చెప్పారు. దీంతో పాటు పా రంజిత్ సినిమా అంటే వాస్తవికతతో పాటు ఒక కొత్త కోణాన్ని ఆవిష్కరించేలా ఉంటుందని అందరికీ తెలుసు. పైగా ఇది కొన్ని వాస్తవ సంఘటనలనే ఆధారంగా చేసుకుని పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ లో రూపొందుతున్న సినిమా అని కూడా చెప్పాడు రంజిత్. ఇక నటుడుగా ఎన్నో ప్రయోగాలు చేసిన విక్రమ్ కు ఇది మరో ప్రయోగాత్మక చిత్రంగానూ కనిపిస్తోంది. కొన్నాళ్ల క్రితం విడుదలైన మేకింగ్ వీడియో చూసి చాలామంది ఆశ్చర్యపోయారు. సినిమా కోసం అంత హార్డ్ వర్క్ చేస్తున్నాడా విక్రమ్ అనిపించాడు.

తాజాగా తంగలాన్ రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు మేకర్స్. 2024 జనవరి 26న రిపబ్లిక్ డే సందర్భంగా విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. పా. రంజిత్ సొంత బ్యానర్ నీలమ్ ప్రొడక్షన్స్ తో పాటు స్టూడియో గ్రీన్ బ్యానర్ సంయుక్తంగా నిర్మిస్తోన్న సినిమా ఇది. ఇక పా. రంజిత్ కబాలి, కాలాతో వెనకబడ్డాడు అనిపించినా.. ‘సార్పట్టా పరంబరై’తో ఫామ్ లోకి వచ్చాడు. ఆ తర్వాత నచ్చిత్తరం నాగర్గిరదు అనే మూవీతో విజయం అందుకున్నాడు. రంజిత్, విక్రమ్ కాంబోలో వస్తోన్న ఫస్ట్ మూవీ కావడంతో ఈ ఇద్దరి అభిమానులు కూడా సినిమా కోసం ఆసక్తిగా చూస్తున్నారు.

విక్రమ్ తో పాటు పార్వతి, మాళవిక మోహనన్, పశుపతి కీలక పాత్రలు చేస్తున్నారు. జివి ప్రకష్ కుమార్ సంగీతం చేస్తున్నాడు. మరి సంక్రాంతి తర్వాత విడుదలవుతోంది కాబట్టి ఈ తంగలాన్ ఎలాంటి రిజల్ట్ అందుకుంటుందో చూడాలి.

Updated : 27 Oct 2023 7:00 PM IST
Tags:    
Next Story
Share it
Top