Anand Deverakonda : అది నన్ను చాలా బాధపెట్టింది..బ్రేకప్ గురించి బయటపెట్టిన బేబి హీరో
X
యూత్ లో విజయ్ దేవరకొండకు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. అర్జున్ రెడ్డి మూవీతో రికార్డులు కొల్లగొట్టి సెన్సేషన్ క్రియేట్ చేశాడు. అలా రౌడీ బాయ్ తమ్ముడిగా దొరసాని మూవీతో వెండితెరకు పరిచమయ్యాడు ఆనంద్ దేవరకొండ. రీసెంట్ గా బేబీ మూవీతో బ్లాక్ బ్లాస్టర్ హిట్ ను సొంతం చేసుకున్నాడు. అయితే తాజాగా తన బ్రేకప్ విషయాన్ని బయటపెట్టాడు ఆనంద్. వాలెంటైన్స్ డే పురస్కరించుకొని ఓ ఇంటర్వ్యూలో తన లవ్, బ్రేకప్ విషయాల్ని పంచుకొని ఎమోషనల్ అయ్యాడు.
గతంలో తాను ఓ అమ్మాయిని ప్రేమించినట్టు తెలిపాడు. అయితే తాను ప్రేమించిన అమ్మాయి ఉన్నత చదువుల కోసం షికాగో వెళ్తే తాను కూడా వెళ్లాలని అనుకున్నట్టు చెప్పాడు. అక్కడికి వెళ్తే ఇద్దరం కలిసి ఉండొచ్చని భావించానని అన్నాడు. అందుకోసం షికాగోలోని టాప్-5 ఇంజినీరింగ్ కాలేజీలకు అప్లై చేస్తే అందులో ఓ దాంట్లో సీటు వచ్చిందని చెప్పాడు.
అక్కడికి వెళ్తే ఇద్దరం కలిసి ఉండొచ్చని అనుకున్నానని..కానీ తిరా అక్కడికి వెళ్లాక కథ అడ్డం తిరిగిందని బాధపడ్డాడు. ప్రేమ వ్యవహరం బెడిసి కొట్టడంతో తన గుండె పగిలిందని చెప్పాడు. ఇక ఆ బ్రేకప్ నుంచి బయటపడేందుకు తనకు ఏకంగా నాలుగైదేళ్లు పట్టినట్టు చెప్పుకొచ్చాడు. తాను నిజాయతీగా ప్రేమించినప్పటికీ ఫలితం లేకుండా పోయిందని, అది తనను చాలా బాధపెట్టిందని ఆనంద్ దేవరకొండ చెప్పాడు.