Home > సినిమా > ఓటీటీలకు కేంద్రం హెచ్చరికలు.. ఆ యాడ్ వేయకుంటే అంతే సంగతులు

ఓటీటీలకు కేంద్రం హెచ్చరికలు.. ఆ యాడ్ వేయకుంటే అంతే సంగతులు

ఓటీటీలకు కేంద్రం హెచ్చరికలు.. ఆ యాడ్ వేయకుంటే అంతే సంగతులు
X

thumb: ఓటీటీలకు కేంద్రం హెచ్చరికలు

పొగ తాగడం ఆరోగ్యానికి హానికరం. ఈ అలవాటు వల్ల ప్రపంచవ్యాప్తంగా ఏటా మిలియన్ల మంది ప్రాణాలు కోల్పోతున్నారు. అందుకే.. అందరూ వీటికి దూరంగా ఉండాలని కేంద్ర ఆరోగ్యమంత్రిత్వ శాఖ ఎప్పటికప్పుడు సూచిస్తుంటుంది. అందులో భాగంగానే థియేటర్లు, సినిమాల్లో ధూమపానంపై వ్యతిరేక ప్రకటన ఇస్తుంటా. కొన్ని సీన్లలో ‘ధూమపానం, మద్యపానం.. ఆరోగ్యానికి హానికరం’ అంటూ హెచ్చరికలు వేస్తుంటారు. కానీ, ఇప్పటికీ చాలామంది జనాల్లో వీటిపై సరైన అవగాహన లేదు.

దాంతో ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పొగాకుపై వ్యతిరేక ప్రకటనలు ఇకపై ఓటీటీలో కూడా వేయాలని ఉత్తర్వులు జారీ చేసింది. అంతేకాకుండా సిగరెట్లు, ఇతర పొగాకు వస్తువులపై ప్రచారాన్ని నిషేదిస్తూ.. 2004 నాటి చట్టంలో నిబంధనలను సవరిస్తూ కేంద్రం నోటిఫికేషన్ జారీ చేసింది. ఓటీటీల్లో పొగాకుపై కనీసం 30 సెకన్ల పాటు యాడ్ ప్రదర్శించాలని సూచించింది. ఈ నిబంధనను ఉల్లంఘిస్తే.. ఆరోగ్య, సమాచార ప్రసార శాఖ వారు కఠిన చర్యలు తీసుకుంటారు. దీంతో ఇప్పటివరకు థియేటర్లలో వచ్చిన పొగాకు యాడ్స్ ఇకపై ఓటీటీలో కూడా రానున్నాయి.

Updated : 31 May 2023 2:50 PM GMT
Tags:    
Next Story
Share it
Top