టాలీవుడ్ డ్రగ్స్ కేసులో కోర్టు సంచలన తీర్పు
X
టాలీవుడ్ డ్రగ్స్ కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. 2018లో నమోదైన ఎక్సైజ్ కేసులను కోర్టు కొట్టేసింది. టాలీవుడ్ డ్రగ్స్‌పై సిట్ 8 కేసులు నమోదు చేసింది. ఈ 8 కేసుల్లో ఆరు కేసులను కోర్టు కొట్టేసింది. సరైన ఆధారాలు సాక్ష్యాలు లేకపోవడంతో ఈ నిర్ణయం తీసుకుంది. ఈ ఆరు కేసుల్లో ఎలాంటి సాక్ష్యాధారాలు లేవని.. డ్రగ్స్ కేసులో పాటించాల్సిన ప్రొసీజర్ ఫాలో కాలేదంటూ కేసులను కొట్టేసింది.
కాగా టాలీవుడ్లో డ్రగ్స్ కేసు సంచలనం సృష్టించింది. సినీ స్టార్స్ను నెలల తరబడి అధికారులు విచారించారు. పలువురు సెలబ్రిటీల దగ్గర నుంచి గోళ్లు, వెంట్రుకల నమూనాలు తీసుకున్న ఎక్సైజ్ శాఖ.. వాటిని ఎఫ్‌ఎస్‌ఎల్‌కు పంపించింది. అయితే పూరీ జగన్నాథ్, తరుణ్ శాంపిల్స్ మాత్రమే ఎఫ్‌ఎస్‌ఎల్ పరిశీలించింది. పూరి జగన్నాథ్, తరుణ్ శరీరంలో డ్రగ్స్ ఆనవాళ్లు లభించలేదని ఎఫ్‌ఎస్‌ఎల్ తేల్చింది. ఎఫ్‌ఎస్‌ఎల్ నివేదిక ఆధారంగా కోర్టు కేసులను కొట్టేసింది.