Home > సినిమా > ఈ 6 నెలలు అతి కష్టంగా గడిచాయి..సమంత ఎమోషనల్ పోస్ట్..

ఈ 6 నెలలు అతి కష్టంగా గడిచాయి..సమంత ఎమోషనల్ పోస్ట్..

ఈ 6 నెలలు అతి కష్టంగా గడిచాయి..సమంత ఎమోషనల్ పోస్ట్..
X

యాక్టింగ్ నుంచి వన్ ఇయర్ బ్రేక్ తీసుకుంటానని ఈ మధ్యనే టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ప్రకటించిన విషయం తెలిసింది. తాజాగా విజయ్ దేవరకొండతో తన అప్‎కమింగ్ మూవీ ఖుషీ షూట్ పూర్తి చేసుకున్న సామ్ ఇన్‎స్టాగ్రామ్‎లో ఓ ఎమోషనల్ పోస్ట్ షేర్ చేసింది. నవ్వుతూ, మినిమం మేకప్‎తో ఉన్న ఓ సెల్పీని పంచుకుని అతి సుదీర్ఘమైన, కష్టతరమైన ఆరు నెలలు చివరి వరకు వచ్చేసింది అంటూ పోస్ట్ పెట్టింది.

సమంత గతంలో మయోసైటీస్ వ్యాధితో బాధపడిన విషయం తెలిసిందే. ఆరోగ్య సమస్య కారణంగా సినిమాలకు కాస్త బ్రేక్ ఇచ్చి కొన్ని రోజులు రెస్ట్ మోడ్‎లోకి వెళ్లిపోయింది. మళ్లీ యాక్టివ్ అయిన సామ్ సినిమా షూటింగ్స్‌లో పాల్గొంటుంది. ఓ వైపు సీటాడెల్, మరోవైపు ఖుషీ సినిమా షూట్లతో విరామం లేకుండా గడుపుతోంది సమంత. గత 6 నెలలుగా క్యారా వ్యాన్ కే పరిమితం అయిపోయింది ఈ బ్యూటీ. దాదాపు షూట్స్ అన్నీ కూడా చివరకు రావడంతో సమంత తాజాగా ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో ఓ భావోద్వేగమైన పోస్ట్ షేర్ చేసింది. ‘‘ ఈ 6 నెలలు చాలా కష్టమైన రోజులు. క్యార వ్యాన్‌లోనే గడిచిపోయాయి. వాటికి ఎలాగైనా ఫినిష్ చేయాలనుకున్న ’’ అంటూ రాసుకొచ్చింది.

సమంతా రూత్ ప్రభు ఆటో-ఇమ్యూన్ వ్యాధి, మైయోసిటిస్‌తో బాధపడుతోంది. ఇది ఆమె కండరాలను ప్రభావితం చేసి తీవ్రమైన నొప్పికి దారితీస్తుంది. మొన్నటి వరకు ఫిట్ గా ఉన్న సామ్ మరోసారి ఈ వ్యాధిబారిన పడినట్లు తెలుస్తోంది. అందుకే సినిమాలకు సంవత్సరం పాటు విరామం ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్లు టాక్ వినిపిస్తోంది. మైయోసిటిస్ ట్రీట్మెంట్ కోసం అమెరికా వెళ్లనున్నట్లు సమాచారం. అందుకే ఈ భామ కొత్త ప్రాజ్టులకు సైన్ చేయలేదు. ఆమె పరిస్థితి ఊహించిన దాని కంటే ముందుగానే మెరుగుపడితే, మరో ఆరు నెలల్లోపు తిరిగి షూటింగ్స్ ప్రారంభం కావచ్చు. ఈ ఆగస్ట్ నాలుగో వారంలో సమంత అమెరికాకు వెళ్తున్నట్లు సమాచారం.






Updated : 10 July 2023 11:37 AM IST
Tags:    
Next Story
Share it
Top