Home > సినిమా > ఆ హీరోతో నటిస్తే ఇక సినిమా ఛాన్సులు రావు!

ఆ హీరోతో నటిస్తే ఇక సినిమా ఛాన్సులు రావు!

ఆ హీరోతో నటిస్తే ఇక సినిమా ఛాన్సులు రావు!
X

సినీ పరిశ్రమ అన్నాక కచ్చితంగా సెంటిమెంట్లు ఉంటాయి. సినిమా మొదలెట్టాలంటే మంచి ముహూర్తం చూసుకుని మరీ స్టార్ట్ చేస్తారు. అలాగే కెరీర్ పరంగా కొందరితో నటిస్తే ఛాన్సులు వెతుక్కుంటూ వస్తాయని అంటూ ఉంటారు. మరికొందరు సినిమా చేస్తే చాలు ఇక ఆఫర్లే ఉండవని ఇంకొందరు చెబుతుంటారు. ఇప్పుడు హీరో ధనుష్ విషయంలో అలాంటిదే వినిపిస్తోంది. ధనుష్ సినిమాలో ఏ హీరోయిన్ నటించినా ఆ బ్యూటీ కెరీర్ కష్టమనే టాక్ వినిపిస్తోంది.

రఘువరణ్ బీటెక్ మూవీలో నటించిన అమలాపాల్ ఆ మూవీ తర్వాత కెరీర్ క్రమేపీ తగ్గుతూ వచ్చింది. సాయిపల్లవి విషయంలో కూడా ఇదే జరిగింది. మారి2 మూవీ చేశాక సినిమా అవకాశాలు తగ్గుతూ వచ్చాయి. ఆ తర్వాత సార్ మూవీలో నటించిన సంయుక్త మీనన్, తిరులో నటించిన నిత్యామీనన్ పరిస్థితి కూడా అలానే అయ్యింది. అందరూ అవకాశాల కోసం చాలా రోజులు ఎదురుచూడాల్సి వచ్చింది.

ఇప్పుడిప్పుడే వారంతా అడపాదడపా ఓ సినిమా చేస్తూ నెట్టుకొస్తున్నారు. దీంతో చాలా మంది ధనుష్ సినిమాలో ఏ హీరోయిన్ నటించినా ఆ మూవీ తర్వాత కెరీర్ క్లోజ్ అవుతుందని అంటున్నారు. దీనిపై నెట్టింట ట్రోలింగ్ కూడా నడుస్తోంది. ధనుష్‌తో సినిమాలు చేసే ముందు హీరోయిన్లు కాస్త ఆలోచించాలని సోషల్ మీడియాలో నెటిజన్లు ఉచిత సలహాలు ఇస్తున్నారు.

Updated : 23 March 2024 4:03 PM IST
Tags:    
Next Story
Share it
Top