Home > సినిమా > వ్యూహం సినిమా వివాదం.. విచారణ మళ్లీ వాయిదా

వ్యూహం సినిమా వివాదం.. విచారణ మళ్లీ వాయిదా

వ్యూహం సినిమా వివాదం.. విచారణ మళ్లీ వాయిదా
X

సెన్సేషనల్ డైరెక్టర్ రామ్‌గోపాల్‌ వర్మ తెరకెక్కించిన ‘వ్యూహం’ సినిమా విడుదలపై ఉత్కంఠ వీడడం లేదు. ఈ మూవీ మొదలైనప్పటి నుంచి వివాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. గత నెల 29న విడుదల కావాల్సి ఉన్న ఈ సినిమాకు హైకోర్టు బ్రేక్ వేసింది. మూవీ విడుదలను ఆపాలంటూ నారా లోకేష్ వేసిన పిటిషన్పై విచారించిన న్యాయస్థానం ఈ నెల 11వరకు విడుదల ఆపాలంటూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ తీర్పుపై నిర్మాత దాసరి కిరణ్ కుమార్ డివిజన్ బెంచ్లో సవాల్ చేశారు.

సినిమా రిలీజ్ ఆగిపోవడంతో రూ.కోట్లలో నష్టం వచ్చిందని పిటిషనర్ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అయితే ఈ అంశాన్ని సింగిల్‌ బెంచ్‌లోనే తేల్చుకోవాలని హైకోర్టు స్పష్టం చేసింది. అయితే ఈ నెల 11కు బదులు 8న విచారణ జరిపి.. ఆ రోజే తీర్పు ఇవ్వాలని పిటిషనర్ న్యాయస్థానానికి విన్నవించారు. ఈ క్రమంలో ఇవాళ హైకోర్టు విచారణ జరిపింది. సినిమా సెన్సార్ సర్టిఫికెట్ తో పాటు రికార్డ్స్ ను సెన్సార్ బోర్డు కోర్టుకు అందజేసింది. ఈ క్రమంలో వీటిని పరిశీలించిన తర్వాత విచారణ చేపడతామని కోర్టు స్పష్టం చేసింది. తదుపరి విచారణను మంగళవారానికి వాయిదా వేసింది.

Updated : 8 Jan 2024 6:52 AM GMT
Tags:    
Next Story
Share it
Top