Home > సినిమా > Vyuham Movie : వ్యూహం సినిమా విడుదలకు హైకోర్టు బ్రేక్

Vyuham Movie : వ్యూహం సినిమా విడుదలకు హైకోర్టు బ్రేక్

Vyuham Movie : వ్యూహం సినిమా విడుదలకు హైకోర్టు బ్రేక్
X

వ్యూహం సినిమాకు మరోసారి బ్రేక్ పడింది. రాంగోపాల్‌వర్మ దర్శకత్వంలో వ్యూహం మూవీకి సెన్సార్ బోర్డు సర్టిఫికెట్ సస్పెన్షన్‌ను. తెలంగాణ హైకోర్టు పొడిగించింది. మరో వారాల పాటు సస్పెండ్ చేస్తున్నట్లు ఉన్నత న్యాయస్థానం పేర్కోంది.సెన్సార్ బోర్డు గతంలో ఇచ్చిన సర్టిఫికెట్ ను క్వాష్ చేసింది. మూడు వారాల్లో మరోసారి సినిమాను పరిశీలించి సెన్సార్ సర్టిఫికెట్ ఇవ్వాలని సెన్సార్ బోర్డును ఆదేశించింది. మరోవైపు, ఎగ్జామింగ్ కమిటీ ఇచ్చిన సవరణలను రివ్యూ కమిటీ పట్టించుకోకపోవడంపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. మరోసారి రెండు కమిటీలు సినిమా చూసి తమకు నివేదిక అందజేయాలని ఆదేశించింది. ఈ చిత్రం టీడీపీ అధినేత చంద్రబాబును కించపరిచేలా ఉందంటూ ఆ పార్టీ యువనేత నారా లోకేశ్ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ వేశారు.

ఈ పిటిషన్ ను విచారించిన హైకోర్టు సినిమాను విడుదల చేవద్దని గతంలోనే ఆదేశాలు జారీ చేసింది. ఇప్పుడు ఏకంగా సెన్సార్ సర్టిఫికెట్ ను క్వాష్ చేసింది. ఏపీ సీఎం వైఎస్ జగన్ జగన్ రాజకీయ జీవితం ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. దర్శకుడు ఆర్జీవీ తెరకెక్కించిన ‘వ్యూహం’ సినిమాలో వివాదాస్పద సీన్లు ఉన్నాయని ఆ సినిమాను నిలిపివేయాలని పలువురు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అటు లోకేశ్ తన తండ్రిని, తనను కించపరుస్తూ అసభ్యకర సీన్లు చిత్రీకరించారని పిటిషన్‌లో దాఖలు చేశారు. ఈ సినిమా సెన్సార్ సర్టిఫికెట్‌ను రద్దు చేయాలని కోరారు. ఈ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ సాగింది. ఇరువర్గాలు తమ వాదనలు వినిపించారు. దీంతో సెన్సార్ బోర్డుకు హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది.

Updated : 22 Jan 2024 12:11 PM IST
Tags:    
Next Story
Share it
Top