నటి హయతికి షాకిచ్చిన హైకోర్టు..
X
గద్దలకొండ గణేష్ సినిమాలో ప్రత్యేకమైన గీతంతో తెలుగు తెరకు పరిచయం అయ్యింది డింపుల్ హయది. తన డాన్స్ , గ్లామర్‌తో యూత్‌కి బాగా కనెక్ట్ అయ్యింది. ఐటమ్ సాంగ్స్ చేస్తున్నప్పటికీ హయతి టాలెంట్ చూసి ఫిదా అయిన ఫిల్మ్ మేకర్స్ హీరోయిన్ ఛాన్స్ కూడా ఇచ్చారు.
కొద్ది కాలంలోనే మంచి నటిగా గుర్తింపు సంపాదించుకుంది హయతి. సినిమాల్లో మంచి హిట్ కోసం ఎదురుచూస్తున్న హయతికి ఊహించన షాక్ తగిలింది. నటి డింపుల్ హయతికి ట్రాఫిక్ డీసీపీ రాహుల్ హెగ్డేకి మధ్య జరిగిన వివాదం పెద్ద దుమారాన్ని రేపింది. ఈ విషయం చాలా దూరం వెళ్లింది. డింపుల్ పైన కేసు నమోదు చేయడంతో మీడియా చూపంతా డింపుల్‌పై పడింది. దీంతో డింపుల్ హయతి పేరు సోషల్ మీడియాలో మారుమోగిపోయింది. ఇదే అంశంలో తాజాగా హయతికి హైకోర్టు షాక్ ఇచ్చింది. పోలీస్ అధికారితో దురుసుగా ప్రవర్తించినందుకుగాను నటితో పాటు న్యాయవాది విక్టర్ డేవిడ్ విచారణకు హాజరు కావాల్సిందేనని హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు
సీఆర్‌పీసీ 41ఏ సెక్షన్ కింద నోటీసులు పంపించాలని జూబ్లీహిల్స్ పోలీసులను ఆదేశించింది.