ఫోటోషూట్‌లో రెచ్చిపోయిన జాన్వీ కపూర్.. కామెంట్స్
X
బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హాట్ ఫొటోషూట్‌తో కుర్రాళ్లలో హీటెక్కిస్తూ ఉంటుంది. సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటూ.. అందాల ఆరబోతలో రెచ్చిపోతుంటుంది. రెగ్యులర్‌గా జిమ్‌కు వెళ్తూ అటు ఫిట్నెస్ విషయంలో కూడా రాజీపడకుండా వర్కవుట్స్ చేస్తుంటుంది. ఎప్పటికపప్పుడు ఫ్యాషన్ దుస్తులు ధరించి గ్లామర్ ఒలకబోస్తూ.. బాలీవుడ్లో ఎప్పుడూ హాట్ టాపిక్ గా మారుతోంది. కుర్రాళ్ల మతిపోగొట్టే విధంగా తన ఫిజిక్‌తో నిరంతరం ఫ్యాన్స్‌కు కనువిందు చేస్తుంది జాన్వీ.
త్వరలోనే జూ. ఎన్టీఆర్, దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమాతో.. తెలుగులోకి ఎంట్రీ ఇవ్వబోతోంది. అయితే బాలీవుడ్లో స్టార్ హీరో వరుణ్ ధావన్‌తో కలిసి 'భవాల్' అనే సినిమాతో ఈరోజే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమా హిట్టా? ఫట్టా? అనే విషయం పక్కన బెడితే.. మూవీ మోషన్స్‌లో హీరో వరుణ్ ధావన్‌తో కలిసి జాన్వీ.. చేసిన ఫొటోషూట్ ప్రస్తుతం నెటిజన్ల కోపానికి కారణమైంది. ఏకంగా హీరో ఒళ్లో కూర్చొని.. బోల్డ్‌గా ఉన్న ఫొటోలను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది జాన్వీ.
చాలా ఇంటిమేట్‌గా ఉన్న ఆ ఫోటోలు కొందరు ఫిల్మ్ లవర్స్‌ను ఇబ్బందిపెట్టాయి. వరుణ్ ధావన్ తొడపై కూర్చున్నట్లుగా ఓ ఫోటో.. ఇక అతన్ని హగ్ చేస్తున్న మరో ఫోటోను జాన్వీ పోస్టు చేసింది. బ్లాక్ డ్రెస్సులో జాన్వీ.. వైట్ అండ్ లెదర్ జాకెట్‌లో వరుణ్ ఉన్న ఆ ఫోటోలపై నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఆ వరుస ఫోటోలపై కొందరు ఎమోజీలతో పంచ్‌లు కూడా విసురుతున్నారు. నిజానికి జాన్వీ పోస్టు చేసిన ఫోటోలపై చాలా వరకు అభిమానులు ఆగ్రహంగానే ఉన్నారు. జాన్వీ ఆంటీ మహేప్ కపూర్ తన కామెంట్ సెక్షన్‌లో హార్ట్ ఐ ఎమోజీని పోస్టు చేసింది. దానికి లవ్ అని కూడా రాసిందామె. ఇక కొందరైతే ఇలాంటి ఫోటోషూట్ అవసరమా అని ప్రశ్నించారు. వరుణ్ ధావన్ లక్స్ కోజీ దుస్తుల్ని ప్రమోట్ చేస్తున్నట్లు ఉందని కొందరన్నారు. పెళ్లి చేసుకున్న తర్వాత ఇలాంటి ఫోటోషూట్ ఏంటని వరుణ్ ను కొందరు ప్రశ్నించారు. ఇక కొందరు అభిమానులు మాత్రం ఆ జంటను డిఫెండ్ చేశారు.