Home > సినిమా > ది కేరళ స్టోరీ కాంబినేషన్లో కొత్త సినిమా .. ఈ సారి..

ది కేరళ స్టోరీ కాంబినేషన్లో కొత్త సినిమా .. ఈ సారి..

ది కేరళ స్టోరీ కాంబినేషన్లో కొత్త సినిమా .. ఈ సారి..
X

ది కేరళ స్టోరీ.. వివాదాలు, నిషేధాల మధ్య రిలీజై 300 కోట్ల కలెక్షన్లను సాధించిన మూవీ. కేరళలోని అమ్మాయిలను మతం మార్చి టెర్రరిజంలోకి తీసుకెళ్తున్నారనే కథాంశంతో బాలీవుడ్ డైరెక్టర్ సదీప్తో సేన్ ఈ మూవీని తెరకెక్కించారు. ఈ మూవీని విపుల్ అమృత్ లాల్ షా నిర్మించారు. మరోసారి ఈ కాంబినేషన్ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సారి టెర్రర్ అటాక్ కథతో ఆడియన్స్ ముందుకు వచ్చేందుకు సిద్ధమయ్యారు.





ఛత్తీస్గఢ్లో జరిగిన టెర్రరిస్ట్ అటాక్పై సినిమా తీస్తున్నట్లు సుదీప్తో సేన్ ప్రకటించారు. ఈ మూవీకి బస్తర్ అనే టైటిల్ను ప్రకటిస్తూ పోస్టర్ రిలీజ్ చేశారు. వచ్చే ఏడాది ఏప్రిల్ 5న ఈ సినిమా రిలీజ్ కానుంది. త్వరలోనే మూవీలో నటించే నటీనటులు, సాంకేతిక నిపుణులకు సంబంధించిన వివరాలను తెలియజేస్తామని ఆయన తెలిపారు. 2010 ఏప్రిల్లో ఛత్తీస్గఢ్లోని బస్తర్ ప్రాంతంలో టెర్రరిస్ట్ అటాక్ జరిగింది. ఈ అటాక్ లో సీఆర్పీఎఫ్ జవాన్లు పెద్దఎత్తున మరణించారు. అదేవిధంగా 8మంది సామాన్యులు కూడా మృతి చెందారు. ఈ అటాక్పైనే సుదీప్తో సేన్ సినిమా తీస్తున్నారు.





మరోవైపు ది కేరళ స్టోరీ మూవీని కొనుగోలు చేసేందుకు ఓటీటీ సంస్థలు ముందుకు రాకపోవడంపై చిత్ర దర్శకుడు సుదీప్తో సేన్ స్పందించారు. చిత్రపరిశ్రమ తమను శిక్షించాలని చూస్తోందని అన్నారు. తమ చిత్రానికి దక్కిన విజయాన్ని చూసి కొంతమంది కక్ష సాధింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఆ కక్షలో భాగంగానే ఓటీటీలు ముందుకు రావడం లేదని చెప్పారు.







Updated : 27 Jun 2023 9:00 AM IST
Tags:    
Next Story
Share it
Top