'The Kerala Story' : ఎట్టకేలకు ఓటీటీలో రిలీజ్ అయిన 'ది కేరళ స్టోరీ'.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
X
గతేడాది దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ది కేరళ స్టోరీ (The Kerala Story) మూవీ ఎట్టకేలకు ఓటీటీలోకి వచ్చేసింది. అనేక వివాదాల నడుమ రిలీజైన ఈ మూవీ విమర్శకులను మెప్పించి సూపర్ హిట్ అయ్యింది. కేరళ రాష్ట్రంలో కనిపించకుండా పోయిన దాదాపు 300 వందల మంది అమ్మాయిల నేపథ్యంలో వచ్చింది ఈ సినిమా. ఈ మూవీని సుదీప్తో సేన్(Sudipto Sen) డైరెక్ట్ చేశారు.
మిస్సైన యువతులను లవ్ జీహద్ పేరుతో..బలవంతంగా మతం మార్చి ఉగ్రవాదులుగా తయారు చేస్తున్నారనే కాన్సెప్ట్ తో ఈ సినిమా రావడంపై దేశవ్యాప్తంగా ఆందోళనలు వెల్లువెత్తాయి.
మతవిద్వేషాలు రెచ్చగొట్టేలా ఈ సినిమా ఉందని, సినిమాను బ్యాన్ చేయాలని కూడా కొందరు కోర్టులో పిటీషన్లు దాఖలు చేశారు. అంతేగాక మూవీలో నటించిన వారిపై కొందరు బెదిరింపులకు కూడా దిగారు. అయితే ఇన్ని ఘర్షణలు, వివాదాల మధ్య థియేటర్స్ లోకి వచ్చిన ఈ సినిమా అద్భుతమైన విజయాన్ని సాధించింది.
విమర్శకుల నోర్లు మూపిస్తూ బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా ఏకంగా రూ.300 కోట్లకు పైగా కలెక్ట్ చేసింది. ఈ మూవీలో హీరోయిన్ అదా శర్మకు మంచి మార్కులు వచ్చాయి. ఈ సినిమా గతేడాది మేలో రిలీజవగా .. అప్పటి నుంచి ఓటీటీకి మాత్రం రాలేదు. కాగా మూవీ లవర్స్ మాత్రం ఈ మూవీ ఓటీటీలోకి ఎప్పుడొస్తుందా అని ఎదురుచూస్తూనే ఉన్నారు.
తాజాగా వారి ఎదురుచూపులకు ఎండ్ కార్డు వేస్తూ.. ఇవాళ (ఫిబ్రవరి 16) ది కేరళ స్టోరీ సినిమాను ఓటీటీలో రిలీజ్ చేశారు మేకర్స్. ప్రముఖ ఓటీటీ సంస్థ జీ5లో మూవీ స్ట్రీమింగ్ కానున్నట్లు తెలిపారు. ఈ మూవీ హిందీతో పాటు తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. ఇంకేందుకు ఆలస్యం...థియేటర్స్ లో మూవీని మిస్సైన వాళ్లు ఎవరైనా ఉంటే ఓటీటీలో ఓ లుక్కేయండి.