Home > సినిమా > ఓటీటీలోకి ది కేరళ స్టోరీ.. ఎప్పట్నుంచంటే..?

ఓటీటీలోకి ది కేరళ స్టోరీ.. ఎప్పట్నుంచంటే..?

ఓటీటీలోకి ది కేరళ స్టోరీ.. ఎప్పట్నుంచంటే..?
X

2023లో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మూవీ ది కేరళ స్టోరీ. గతేడాది మే 5న ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా థియేటర్లలో కలెక్షన్ల సునామీ సృష్టించింది. కేవలం రూ.20 కోట్ల బడ్జెట్తో చిన్న సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా రూ.300 కోట్లకుపైగా వసూలు చేసింది. సినిమా రిలీజైన 9 నెలల తర్వాత ఓటీటీలోకి వస్తోంది. ఫిబ్రవరి 16 నుంచి ప్రముఖ ఓటీటీ జీ5లో స్ట్రీమింగ్ కానుంది. ఈ మేరకు జీ 5 ఓ వీడియో రిలీజ్ చేసింది.

సుదీప్తో సేన్ దర్శకత్వం వహించిన 'ది కేరళ స్టోరీ'ని విపుల్ అమృతలాల్ షా నిర్మించారు. అదా శర్మ, యోగితా బిహానీ, సిద్ధి ఇద్నాని, సోనియా బలానీ కీలక పాత్రల్లో నటించారు. కేరళలో దాదాపు 32 వేల మంది అమ్మాయిలను బలవంతంగా మతం మార్పించి వారిని తీవ్రవాదులుగా ఎలా మార్చారన్నది ఈ సినిమాలో చూపించారు. ఈ సినిమా రిలీజైన సమయంలో తీవ్ర వివాదం తలెత్తింది. బెంగాల్లో ఈ మూవీపై నిషేధం విధించగా.. ఓటీటీలోకి వచ్చేందుకు కూడా చాలా అడ్డంకులు ఎదురయ్యాయి. మొదట అసలు ఈ సినిమాను తీసుకోవడానికి ఏ ఓటీటీ ముందుకు రాలేదు. చివరకు జీ 5 ఓకే చెప్పడంతో 16న ఓటీటీలో ప్రేక్షకుల ముందుకురానుంది.

Updated : 6 Feb 2024 7:13 PM IST
Tags:    
Next Story
Share it
Top