ప్రముఖ సంగీత దర్శకుడు, ఆస్కార్ విజేత ఎంఎం కీరవాణి చేతుల మీదుగా "షరతులు వర్తిసాయి"
X
చైతన్య రావు, భూమి శెట్టి జంటగా నటించిన చిత్రం "షరతులు వర్తిస్తాయి". కుమారస్వామి(అక్షర) దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని స్టార్ లైట్ స్టూడియోస్ బ్యానర్‌పై నాగార్జున సామల, శ్రీష్ కుమార్ గుండా, డాక్టర్ కృష్ణకాంత్ చిత్తజల్లు నిర్మించారు. "షరతులు వర్తిస్తాయి" సినిమా త్వరలో థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన రెండు పాటలకు మంచి స్పందన వచ్చింది. తాజాగా 'కాలం సూపుల గాలంరా..' అనే మరో లిరికల్ సాంగ్ ను ప్రముఖ సంగీత దర్శకుడు, ఆస్కార్ విజేత ఎంఎం కీరవాణి చేతుల మీదుగా రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా
సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి మాట్లాడుతూ - "షరతులు వర్తిసాయి" సినిమాలో 'కాలం సూపుల గాలంరా..' పాటకు గోరేటి వెంకన్న సాహిత్యాన్ని అందించగా రామ్ మిర్యాల పాడాడు. స్నేహితుడు అరుణ్ చిలువేరు సంగీతాన్ని అందించారు. ఆల్ ది బెస్ట్ అరుణ్ అండ్ టీమ్. చైతన్య హీరోగా కుమారస్వామి దర్శకత్వం వహించిన "షరతులు వర్తిసాయి" సినిమాను షరతులు పెట్టకుండా ఆడియెన్స్ చూసి విజయవంతం చేస్తారని కోరుకుంటున్నా. అన్నారు.
మామిడి హరికృష్ణ మాట్లాడుతూ - స్టార్ లైట్ స్టూడియోస్ వారు నిర్మిస్తున్న మొదటి సినిమా ఇది. ప్రొడ్యూసర్స్ ఎన్ఆర్ఐలు అయినా సినిమా మీద ప్యాషన్ తో టాలీవుడ్ లోకి అడుగుపెడుతున్నారు. ఇదొక మంచి మిడిల్ క్లాస్ ఫ్యామిలీ డ్రామా. కరీంనగర్ బ్యాక్ డ్రాప్ లో సినిమా ఉన్నా కథలోని ఎమోషన్ యూనివర్సల్ గా అందరికీ కనెక్ట్ అయ్యేలా ఉంటుంది. మానవ సంబంధాల్లో వస్తున్న పరిణామాల చుట్టూ "షరతులు వర్తిసాయి" కథ సాగుతుంది. ఆర్ఆర్ఆర్ సినిమాతో ఆస్కార్ అవార్డ్ గెల్చుకుని భారతీయ సినిమా ఖ్యాతిని మరింతగా పెంచారు కీరవాణి గారు. ఆయన చేతుల మీదుగా ఇవాళ మా సినిమాలోని 'కాలం సూపుల గాలంరా..' పాటను రిలీజ్ చేసుకోవడం సంతోషంగా ఉంది. మా టీమ్ తరుపున కీరవాణి గారికి కృతజ్ఞతలు చెబుతున్నాం. అన్నారు.
హీరో చైతన్య రావ్ మాట్లాడుతూ - కీరవాణి గారు మా "షరతులు వర్తిసాయి" సినిమాలోని 'కాలం సూపుల గాలంరా..' పాట రిలీజ్ చేయడం గౌరవంగా భావిస్తున్నాం. ఆయనకు మా టీమ్ తరుపున కృతజ్ఞతలు చెబుతున్నాం. ఈ పాటకు గోరేటి వెంకన్న గారు అద్భుతమైన సాహిత్యాన్ని అందించారు. రామ్ మిర్యాల అంతే గొప్పగా పాడారు. అరుణ్ ఇచ్చిన ట్యూన్ ఆడియెన్స్ కు బాగా రీచ్ అవుతుంది. త్వరలోనే థియేటర్స్ ద్వారా "షరతులు వర్తిసాయి" రిలీజ్ చేయబోతున్నాం. మీరంతా మా సినిమాను చూసి ఎంజాయ్ చేస్తారని ఆశిస్తున్నాం. అన్నారు.
డైరెక్టర్ కుమారస్వామి మాట్లాడుతూ - ఈ ఒత్తిడి ప్రపంచంలో దర్శకుడిగా నాకు రిలీఫ్ ఇచ్చేది సంగీతమే. నేను రోజూ వినే పది పాటల్లో నాలుగు కీరవాణి గారివే ఉంటాయి. ఆయన విలువైన సమయాన్ని కేటాయించి మా "షరతులు వర్తిసాయి" సినిమాలోని 'కాలం సూపుల గాలంరా..' పాట రిలీజ్ చేసినందుకు కీరవాణి గారికి పాదాభివందనాలు తెలియజేస్తున్నా. ఈ పాటకు గోరేటి వెంకన్న సాహిత్యం, అరుణ్ చిలువేరు కంపోజిషన్, రామ్ మిర్యాల పాడిన విధానం మిమ్మల్ని ఆకట్టుకుంటాయి. ఈ పాట వినండి, మీ స్నేహితులకు షేర్ చేయండి. అన్నారు.
'కాలం సూపుల గాలంరా..' పాటకు గోరేటి వెంకన్న లిరిక్స్ అందించగా..అరుణ్ చిలువేరు మ్యూజిక్ కంపోజ్ చేశారు. రామ్ మిర్యాల పాడారు. 'కాలం సూపుల గాలంరా ఇది కవ్వించేటి మేళము తాళము..మంటిని మింటిని వేళము వేసేటి అంగడి ఆటరా..కాసుల కట్టల ఆశరా ఇది కాటికి పోయిన ఇడువదు ఒడువదు దోసిలికందదు దప్పిక తీరదు ఎండమావిరా కొండలమీది సుక్కల పందిరి అందేదెన్నడు సోదరా హద్దులు లేని ఆకాశానికి అంచులు వెతకకురా ' అంటూ సగటు మనిషి జీవితానికి, అతని భావోద్వేగాలకు అద్దం పట్టేలా సాగుతుందీ పాట.