'Love Your Father ' : లవ్ యువర్ ఫాదర్' మూవీ గ్రాండ్ ఓపెనింగ్
X
తండ్రి కొడుకుల అనుబంధం నేపథ్యంలో ఎన్ని సినిమాలు వచ్చినా ఎప్పుడూ ఆకట్టుకుంటాయి. మంచి కథ, కథనాలతో పాటు ఎమోషనల్ గా హార్ట్ టచింగ్ గా ఉంటే కమర్షియల్ గా పెద్ద విజయాలు సాధించిన సందర్భాలు అనేకం ఉన్నాయి. అలా టైటిల్ తోనే ఓ మంచి ఎమోషనల్ మూవీలా కనిపిస్తోన్న చిత్రం ‘ఎల్ వై ఎఫ్’. అంటే లవ్ యువర్ ఫాదర్ అని అర్థం. టైటిల్ తోనే తండ్రిని ప్రేమించమని చెప్పడం అంటే ఆయన విలువను తెలియజేసే కథ అనుకోవచ్చు. తాజాగా ఈ లవ్ యువర్ ఫాదర్ సినిమా ప్రారంభం అయింది. గతంలో శుభలగ్నం, యమలీల, మాయలోడు, వినోదం లాంటి కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ తో సూపర్ హిట్స్ అందించిన మనీషా ఆర్ట్స్ అండ్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ కొంత గ్యాప్ తర్వాత ఈ సినిమాతో మళ్లీ నిర్మాణం మొదలుపెడుతోంది. శ్రీ హర్ష, కషిక కపూర్ జంటగా నటిస్తోన్న ఈ చిత్రాన్ని పవన్ కేతరాజు డైరెక్ట్ చేశాడు. మనీషా ఆర్ట్స్ అండ్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్ పై కిశోర్ రాఠీ, మహేష్ రాఠీ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇక ఈ మూవీ పూజా కార్యక్రమం మల్లారెడ్డి కాలేజ్ లో ఘనంగా జరిగింది.
ఈ సందర్భంగా నిర్మాత మహేష్ రాఠీ గారు మాట్లాడుతూ.. ‘‘1983 నుంచి ఇప్పటివరకు మా మనిషా యాక్షన్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ సక్సెస్ఫుల్ గా రన్ అవుతూనే ఉంది. ఈ సినిమా లైఫ్ లవ్ యువర్ ఫాదర్ ఒక మంచి తండ్రి కొడుకుల మధ్యనున్న ఎమోషన్స్ ని, బాండింగ్ ని చూపించే విధంగా ఉంటుంది.ఎనిమిది నెలలుగా స్క్రిప్ట్ పైన కూర్చుని చాలా మంచిగా డెవలప్ చేసుకున్నాం. ఈ సినిమాకి మణిశర్మ గారు మ్యూజిక్ అందించడం జరిగింది. ఈ లైఫ్ మనకి దేవుడు ఇచ్చింది దేవుడు తర్వాత తండ్రి సో ఐ లవ్ మై ఫాదర్. మా నాన్నగారి బ్లెస్సింగ్స్ ఎప్పుడు నాతో ఉంటాయి. అలాగే మీ అందరి బ్లెస్సింగ్స్ కూడా ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను..’’ అన్నారు.
హీరో శ్రీహర్ష మాట్లాడుతూ .. ‘‘ ఇది నా మొదటి సినిమా 100% కష్టపడి అందరికీ నచ్చే విధంగా చేస్తాను. మీ సపోర్ట్,బ్లెస్సింగ్స్ ఎప్పుడు నాపై ఉండాలని కోరుకుంటున్నాను..’’ అన్నారు.
రియా మాట్లాడుతూ.. ‘‘ఈ సినిమాలో నేను మేఘన క్యారెక్టర్ చేస్తున్నాను. ఈ క్యారెక్టర్ వచ్చినందుకు చాలా ఎగ్జైటెడ్ గా ఉన్నాను. కచ్చితంగా ఈ సినిమా అందరికీ నచ్చుతుంది. మీరు ఇంటికి వెళ్ళేటప్పుడు ఒక మంచి మెమరీ తీసుకెళ్తారు. ఈ సినిమాని మమ్మల్ని సపోర్ట్ చేసి బ్లెస్ చేయాలని కోరుకుంటున్నాను..’’ అన్నారు.
ఏ రామస్వామి రెడ్డి గారు మాట్లాడుతూ.. ‘‘మా అబ్బాయి శ్రీహర్షని హీరోగా లాంచ్ చేయడం చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమాలో అన్ని ఎలిమెంట్స్ ఉంటాయి. ఫాదర్ అండ్ సన్ సెంటిమెంట్.. ఎమోషన్,లవ్ ఉంటుంది.అలాగే శివుడి పైన మంచి పాట కూడా ప్లాన్ చేసాం.మణిశర్మ గారు మంచి మ్యూజిక్ ఇచ్చారు.ఈ సినిమా మంచి సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను..’’ అన్నారు.
దర్శకుడు పవన్ కేతరాజు మాట్లాడుతూ.. ‘‘గతంలో కో డైరెక్టర్ గా చాలా సినిమాలకు వర్క్ చేశాను.కిషోర్ రాఠీ గారు నన్ను స్వయంగా పిలిచి ఈ సినిమా నాకు ఇవ్వడం జరిగింది. సూర్య ది గ్రేట్, దర్యాప్తు, యమలీల, మాయలోడు, వినోదం లాంటి ఎన్నో మంచి హిట్ సినిమాలు అందించిన మనిషా ఫిలిమ్స్ బ్యానర్ పై సినిమా చేయడం చాలా ఆనందంగా ఉంది. కిషోర్ రాఠీ గారి లైఫ్ లోని చిన్న ఇన్సిడెంట్ ని తీసుకుని వాటినే డెవలప్ చేసుకోవడం జరిగింది.తండ్రి కొడుకుల ఎమోషనల్ జర్నీ ఈ సినిమా. లైఫ్ 'లవ్ యువర్ ఫాదర్'. ఇంత మంచి అవకాశం నాకు ఇచ్చిన కిషోర్ రాఠీ గారికి, మహేష్ రాఠీ గారికి, రామస్వామి రెడ్డి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను.. ’’ అన్నారు.