భార్య రక్షితతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్న శర్వానంద్
X
తిరుమల శ్రీవారిని టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్ సతీసమేతంగా దర్శించుకున్నాడు. భార్య రక్షితతో కలిసి తిరుమలలో సందడి చేశాడు శర్వా. శనివారం ఉదయం శ్రీవారికి జరిగిన అభిషేక సేవలో కుటుంబ సభ్యులతో పాటు కొత్త జంట పాల్గొంది. వేంకటేశ్వరస్వామివారికి ప్రత్యేక పూజలను నిర్వహించి తమ మొక్కులను చెల్లించుకున్నారు శర్వానంద్ దంపతులు. అనంతరం రంగనాయకుల మండపంలో పండితుల ఆశీర్వచనాలు తీసుకున్నారు. అర్చకులు స్వామివారి తీర్థప్రసాదాలను ఈ నవ దంపతులకు అందజేశారు.
యంగ్ హీరో శర్వానంద్ ఈ మధ్యనే ఓ ఇంటివాడయ్యాడు. జూన్ 3న మజీ మంత్రి బొజ్జల గోపాల కృష్ణారెడ్డి మనవరాలు రక్షితతో రాజస్థాన్‌లోని జైపూర్‌లో ఉన్న లీలా ప్యాలెస్‌లో అంగరంగవైభవంగా వివాహం జరిగింది. రెండు రోజులపాటు అట్టహాసంగా జరిగిన ఈ పెళ్లి వేడుకల్లో కేవలం కుటుంబ సభ్యులు, సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు. ఆ తరువాత జరిగిన రిసెప్షన్‌కు రాజకీయ ప్రముఖులను, సినీ పెద్దలను ఆహ్వానించారు. పెళ్లి తర్వాత శర్వానంద్ మొదటిసారిగా తిరుమలలో సందడి చేశాడు. భార్యతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నాడు.