Home > సినిమా > Hero Ajith : హాస్పిటల్‌లో స్టార్ హీరో.. ఫ్యాన్స్ టెన్షన్

Hero Ajith : హాస్పిటల్‌లో స్టార్ హీరో.. ఫ్యాన్స్ టెన్షన్

Hero Ajith : హాస్పిటల్‌లో స్టార్ హీరో.. ఫ్యాన్స్ టెన్షన్
X

చెన్నై అపొలో ఆస్పత్రిలో తమిళ సూపర్ స్టార్ అజిత్ కుమార్ కనిపించారు. ప్రస్తుతం ఆయనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అజిత్ అనారోగ్యంతోనే ఆస్పత్రిలో అడ్మిట్ అయ్యారని పలు కథనాలు వెలువడుతున్నాయి. అయితే తమిళ మీడియా మాత్రం కార్డియో న్యూరో పరీక్షల కోసం ఆస్పత్రికి అజిత్ వచ్చాడని చెప్పుకొచ్చాయి. అజిత్‌కు సంబంధించిన వీడియో నెట్టింట ప్రత్యక్షం అవ్వడంతో అభిమానులు టెన్షన్ పడ్డారు. అజిత్ విషయం తెలిసి ఫ్యాన్స్ అంతా ఆస్పత్రికి చేరుకుంటూ వస్తున్నారు.


అయితే హీరో అజిత్ జనరల్ చెకప్ కోసమే హాస్పిటల్‌కు వెళ్లారని సన్నిహిత వర్గాల నుంచి సమాచారం. రెగ్యులర్ చెకప్‌ల కోసమే అజిత్ ఆస్పత్రికి వెళ్లారట. ప్రస్తుతం అజిత్‌కు ఏ ఆరోగ్య సమస్యలు లేవని చెప్పుకొచ్చారు. తమిళ ఇండస్ట్రీ పీఆర్ మనోబాల కూడా అజిత్ క్షేమంగానే ఉన్నారని చెప్పుకొచ్చారు. సోషల్ మీడియాలో వస్తున్న వార్తలన్నీ ఫేక్ అని ఆయన ట్వీట్ చేశారు. దీంతో అజిత్ ఫ్యాన్స్ కొంత ఊపిరి పీల్చుకున్నారు.


ప్రస్తుతం అజిత్ మగిజ్ తిరుమేని దర్శకత్వంలో 'విడ ముయిర్చి' అనే సినిమాలో నటిస్తున్నారు. అందులో త్రిష హీరోయిన్‌గా చేస్తోంది. ఫారిన్‌లో ఈ మూవీ నెక్ట్స్ షెడ్యూల్ ఉంటుందట. అందుకోసం అజిత్ ప్రిపేర్ అవుతున్నట్లు తెలుస్తోంది. అందుకే ఆయన కొన్ని ఆరోగ్య చెకప్‌లు చేయించుకున్నట్లు సమాచారం. లైకా ప్రొడక్షన్స్‌లో తెరకెక్కుతోన్న ఈ మూవీ యాక్షన్ థ్రిల్లర్‌గా రానుంది. ఈ మూవీలో అర్జున్ సర్జా, రెజీనా, ఆరవ్ వంటివారు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ మూవీకి అనిరుధ్ రవిచంద్రన్ మ్యూజిక్ అందిస్తున్నారు.


Updated : 8 March 2024 4:08 PM IST
Tags:    
Next Story
Share it
Top