Home > సినిమా > యూ ట్యూబ్ పై దేవర సునామీ

యూ ట్యూబ్ పై దేవర సునామీ

యూ ట్యూబ్ పై దేవర సునామీ
X

యంగ్ టైగర్ ఎన్టీఆర్ దేవర సినిమా గ్లింప్స్ తోనే రికార్డులు క్రియేట్ చేస్తోంది. కొరటాల శివ డైరెక్షన్ లో రూపొందుతోన్న ఈ మూవీ ఫస్ట్ పార్ట్ గ్లింప్స్ కు యూ ట్యూబ్ షేక్ అవుతోంది. అన్ని భాషల్లో కలిపి ఈ గ్లింప్స్ ను 15గంటల్లోనే 40మిలియన్ పీపుల్ చూశారు. సోలో హీరోగా ఎన్టీఆర్ కు ఇప్పటి వరకూ ఇదే అతిపెద్ద రికార్డ్ కావడం విశేషం. దేవరతో మరోసారి ప్యాన్ ఇండియన్ ఆడియన్స్ ను మెస్మరైజ్ చేయబోతున్నాడని.. అలాగే ప్యాన్ ఇండియన్ రేంజ్ లో ఆడియన్స్ కూడా ఈ మూవీ కోసం ఎదురుచూస్తున్నారని ఈ వ్యూస్ చూస్తే అర్థం అవుతుంది. 40 మిలియన్ వ్యూస్ అనేది చిన్న విషయం అయితే కాదు. ఒకవేళ ఏ టీజరో, ట్రైలరో వచ్చి ఉంటే ఎన్నో సినిమాల రికార్డులు కూడా కనుమరుగు అయిపోయేవి అని ఖచ్చితంగా చెప్పొచ్చు.

ఆర్ఆర్ఆర్ లో ఎన్టీఆర్ నటనకు ప్రపంచం ఫిదా అయింది. దాన్ని కంటిన్యూ చేస్తూ దేవరతో కంట్రీ మొత్తం పాగా వేసే ప్రయత్నం చేయబోతున్నాడని అర్థం చేసుకోవచ్చు. ఈ మూవీ బ్లాక్ బస్టర్ అయితే నెక్ట్స్ బాలీవుడ్ లో చేబోతోన్న వార్ 2 చిత్రానికి బిగ్గెస్ట్ ఎసెట్ అవుతాడు ఎన్టీఆర్. అలాగే ప్రశాంత్ నీల్ తో చేసే ప్రాజెక్ట్ కు కూడా ఓ రేంజ్ బజ్ క్రియేట్ అవుతుంది. దేవర గ్లింప్స్ లో ఎన్టీఆర్ చేసిన సంహారానికి సముద్రమే ఎరుపెక్కి ఎర్ర సముద్రంగా మారిపోయింది. అలాగే సినిమాకు బాక్సాఫీస్ కూడా షేక్ అయిపోయి దేవరకు గులామ్ అవుతుందేమో చూడాలి.

Updated : 9 Jan 2024 11:01 AM IST
Tags:    
Next Story
Share it
Top