బాలయ్యపై షాకింగ్ కామెంట్స్ చేసిన స్టార్ హీరోయిన్
X
నటసింహం నందమూరి బాలకృష్ణ వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. డైరెక్టర్ బాబీతో చేస్తున్న సినిమా బ్లాక్ బస్టర్ కొట్టాలనే పట్టుదలతో బాలయ్య ఉన్నాడు. ఇప్పటికే అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి వంటి సినిమాలు వరుసగా హిట్ అయ్యాయి. బాబీ సినిమా తర్వాత బోయపాటితో మరోసారి జతకట్టనున్నాడు. ఓ వైపు పాలిటిక్స్, మరోవైపు సినిమాలు చూసుకుంటూ బిజీబిజీగా ఉన్న బాలయ్యపై ఓ స్టార్ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్ చేసింది.
అప్పల్లో ఓ వెలుగు వెలిగిన హీరోయిన్ రచనా బెనర్జీ. బాలయ్యపై ఆమె చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. బాలయ్య సెట్స్‌లో చాలా కోపంగా ఉంటాడని, ఏ తప్పు జరిగినా సహించేవారు కాదని తేల్చి చెప్పేసింది. బాలయ్యతో సినిమా చేస్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండేదాన్నని చెప్పుకొచ్చింది. మెగాస్టార్ చిరంజీవితో నేను ప్రేమిస్తున్నాను, బావగారు బాగున్నారా వంటి మూవీస్ చేసిన రచన.. ఆ తర్వాత బాలయ్యతో సుల్తాన్ సినిమాలో నటించింది.
ఈ బెంగాలీ ముద్దుగుమ్మ అప్పట్లో తెలుగు స్టార్ హీరోలందరితో జతకట్టింది. ప్రస్తుతం తెలుగు సినిమాల్లో మంచి ఆఫర్లు వస్తున్నాయని చెప్పుకొచ్చింది. బాలయ్యపై ఆమె చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. దీనిపై బాలయ్య ఇంకా స్పందించలేదు. అయితే బాలయ్యతో పెట్టుకుంటే మాత్రం దబిడి దిబిడే అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.