Home > సినిమా > కానిస్టేబుల్‌ను ప్రేమించిన నక్సలైట్ కథ..'లంబసింగి' మూవీ రివ్యూ

కానిస్టేబుల్‌ను ప్రేమించిన నక్సలైట్ కథ..'లంబసింగి' మూవీ రివ్యూ

కానిస్టేబుల్‌ను ప్రేమించిన నక్సలైట్ కథ..లంబసింగి మూవీ రివ్యూ
X

బిగ్‌బాస్ ఫేమ్ 'దివి' మెయిన్ లీడ్‌లో చేసిన సినిమా 'లంబసింగి'. డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణ ఈ మూవీని నిర్మించారు. నవీన్ గండి దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీలో భరత్ రాజు హీరోగా చేశారు. ఇప్పటికే ట్రైలర్‌తో ఆకట్టుకున్న ఈ చిత్రం నేడు ఆడియన్స్ ముందుకు వచ్చింది. ప్రేమకథతో సాగే ఈ మూవీ హిట్ టాక్‌ను తెచ్చుకుంది.

కథ ఏంటంటే:

హీరో భరత్ రాజు (వీరబాబు)కి లంబసింగిలో పోలీస్ కానిస్టేబుల్‌గా ఉద్యోగం వస్తుంది. ఆ ఊర్లో దిగిన వెంటనే హీరోయిన్ దివిని చూసి ఫ్లాట్ అవుతాడు. దివితో ప్రేమలో పడతాడు. మరోవైపు ఆ లంబసింగి ఊరు చుట్టూ నక్సలైట్లు ఎక్కువగా ఉంటారు. అందులో కొందరు పోలీసులకు లొంగిపోతారు. జనజీవన స్రవంతిలో కలవడంతో వారంతా రోజూ పోలీస్ స్టేషన్‌కు వచ్చి సంతకం పెట్టి వెళ్తుంటారు. లొంగిపోయిన నక్సలైట్స్‌లో దివి తండ్రి, నక్సలైట్ దళం లీడర్ కోనప్ప కూడా ఉంటారు. ఒక రోజు ఎమ్మెల్యే ఆ ఊర్లో భూమి పూజకు వస్తే ల్యాండ్ మైన్ పేలి చనిపోతాడు. దివి తండ్రి దళమే అలా చేసిందని తెలుస్తుంది. ఆ రాత్రి లంబసింగి పోలీస్ స్టేషన్‌లో ఉన్న హీరోను నక్సలైట్స్ దాడి చేసి తుపాకులను ఎత్తుకెళ్లిపోతారు. ఆ రాత్రి దళం సభ్యుల్లో దివిని చూసి హీరో షాక్ అవుతాడు. అదే ఇంటర్వెల్ ట్విస్ట్. సెకండాఫ్‌లో దివి నక్సలైట్‌గా ఎందుకు మారింది? ఆమె నక్సలైట్ అని తెలిసిన తర్వాత హీరో ప్రేమిస్తాడా? లేదా? దివి మన హీరో ప్రేమను ఒప్పుకుంటుందా? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

విశ్లేషణ:

పోలీస్ కానిస్టేబుల్‌కు నక్సలైట్‌కు మధ్య లవ్ స్టోరీ పెట్టడంతో కాస్త డిఫరెంట్‌గా అనిపిస్తుంది. ఓ వైపు లంబసింగి అందాలు, మరో వైపు వాటి మధ్యసాగే ప్రేమకథను చూపించడంలో డైరెక్టర్ సక్సెస్ అయ్యారు. ఫస్టాఫ్ మొత్తం ప్రేమకథ, కామెడీ సీన్లు ఉంటాయి. ఇంటర్వెల్ ముందు ట్విస్ట్ పెట్టడం అనేది ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచింది. సెకండాఫ్‌లో ప్రేమకథ సాగుతూనే పోలీసులకు, నక్సలైట్లకు మధ్య కాల్పులు, ఎమోషనల్ సీన్స్ సాగుతాయి. క్లైమాక్స్‌కు ముందు మరో ట్విస్ట్ అందర్నీ ఆకట్టుకుంటుంది. ఇప్పటికే కొన్ని సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, బిగ్‌బాస్ కంటెస్టెంట్‌గా పేరు తెచ్చుకున్న దివి ఈ మూవీలో హీరోయిన్‌గా మెప్పించింది. పల్లెటూరి అమ్మాయిగా అలరించింది. హీరో భరత్ రాజ్ పోలీస్ కానిస్టేబుల్ పాత్రకు న్యాయం చేశాడు. కెమెరా విజువల్స్ ఆకట్టుకుంటాయి. ట్విస్టులు, ఎమోషన్స్‌తో సరదాగా సాగే ఈ మూవీ ప్రేక్షకుల్ని మెప్పించడంలో కొంత వరకూ సక్సెస్ అయ్యింది. ఫస్టాఫ్‌లో ఒక 40 నిమిషాల పాటు బోర్ అనిపించినా కొన్ని సీన్లు ఆసక్తిని పెంచుతాయి.

Mic Tv రేటింగ్: 2.5/5

Updated : 15 March 2024 4:58 PM IST
Tags:    
Next Story
Share it
Top