ఇట్ల నవ్వే మా బతుకులు ఆగం చేస్తరు.. ట్రైలర్తో హైప్ పెంచాడు
X
రెండేళ్ల కిందట వచ్చిన డీజే టిల్లు సినిమా టాలీవుడ్ లో ఓ సెన్సేషన్ సృష్టించింది. అందులోని సిద్ధు జొన్నలగడ్డ బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివరీ ప్రేక్షకులకు బాగా నచ్చింది. కాగా అప్పుడే ఈ సినిమాకు సీక్వెల్ ఉంటుందని ప్రకటించారు. కాగా తాజాగా.. ఐకానిక్ క్యారెక్టర్ ‘టిల్లు’తో ప్రేక్షకులను మరోసారి అలరించనున్నాడు. ఈ సినిమాకు సీక్వెల్ గా ‘టిల్లు స్క్వేర్’తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. మాలిక్ రామ్ డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాలో.. అనుపమ పరమేశ్వరన్ నటిస్తుంది. మార్చి 29న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా ట్రైలర్ తాజాగా మేకర్స్ విడుదల చేశారు. వాలెంటైన్స్ డేని పురస్కరించుకుని తాజాగా ఈ చిత్ర థియేట్రికల్ ట్రైలర్‌ను తీసుకొచ్చారు. ఈ ట్రైలర్ ప్రస్తుతం యూట్యూబ్ టాప్‌లో ట్రెండ్ అవుతోంది.
మొదటి పార్ట్ లో ఉన్నట్లే ఇందులో కూడా క్రైమ్, కామెడీ, రొమాన్స్ చాలానే ఉన్నాయి. ఈ సినిమాలో కూడా సిద్ధు జొన్నలగడ్డ మార్క్ కనిపిస్తుంది. దీంతో సినిమాపై భారీ అంచనాలు పెరిగిపోయాయి. ఇందులో అనుపమ హద్దులు చెరిపేసి రెచ్చిపోయింది. పూర్తి గ్లామర్ రోల్ లో నటించింది. ఏదేమైనా ఈ ట్రైలర్ సినిమాపై మరింత ఇంట్రెస్ట్ ను క్రియేట్ చేస్తుంది.