Home > సినిమా > ప్రభాస్ ఫ్యాన్స్కు షాక్.. వారికి థియేటర్లో నో ఎంట్రీ

ప్రభాస్ ఫ్యాన్స్కు షాక్.. వారికి థియేటర్లో నో ఎంట్రీ

ప్రభాస్ ఫ్యాన్స్కు షాక్.. వారికి థియేటర్లో నో ఎంట్రీ
X

డిసెంబర్ 22న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయిన ప్రభాస్ ‘సలార్’ సినిమా.. సంచలన రికార్డులు నమోదుచేస్తుంది. అన్ని భాషల్లో దూసుకుపోతుంది. మాస్ యాక్షన్ గా వచ్చిన సినిమా, చాలాకాలం తర్వాత ప్రభాస్ అలాంటి రోల్ లో కనిపించే సరికి.. జనాలు థియేటర్స్ కు క్యూ కడుతున్నారు. దీంతో బాక్సాఫీసు వద్ద రికార్డులు కొల్లగొడుతుంది. దీంతో అభిమానుల సంబరాలకు అంతులేకుండా పోయింది. ఈ క్రమంలో ప్రభాస్ ఫ్యాన్స్ కు షాక్ తగిలింది. 18 ఏళ్లు నిండని వాళ్లు థియేటర్ లోకి అనుమతి లేదని పోలీసులు నిబంధన పెట్టారు. దీంతో తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన ప్రభాస్ అభిమానులు పోలీసులపై వాగ్వాదానికి దిగారు.

గుంటూరు, నాజ్ సెంటర్ లోని పీవీఆర్ థియేటర్ లో జరిగిందీ ఘటన. 18 ఏళ్లు నిండని వారిని థియేటర్ లోకి అనుమతించబోమని యాజమాన్యం కండీషన్ పెట్టింది. దీంతో కుటుంబ సభ్యులు, పిల్లలతో కలిసి సినిమా చూసేందుకు వచ్చిన అభిమానులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. లోనికి అనుమతించకపోతే.. టికెట్ డబ్బులు వెనక్కి ఇచ్చేయాలంటూ యాజమాన్యాన్ని ఫ్యాన్స్ డిమాండ్ చేశారు. డబ్బులు చెల్లించేది లేదని యాజమాన్యం చెప్పడంతో.. ఫ్యాన్స్ నిరసనకు దిగారు. విషయం తెలుసుకున్న పోలీసులు థియేటర్ వద్దకు వెళ్లి పరిస్థితిని చక్కబెట్టే ప్రయత్నం చేశారు.

ఈ క్రమంలో అభిమానులు, పోలీసుల మధ్య వాగ్వాదవ జరిగింది. ఆన్ లైన్ బుకింగ్ టైంలో 18 ఏళ్ల నిబంధన ఎందుకు స్పష్టంగా ఇవ్వలేదని సిబ్బందిని ప్రశ్నించారు. దీంతో వారం రోజుల వ్యవధిలో ప్రేక్షకుల సొమ్ము తిరిగి వారి అకౌంట్ లో పడేలా చూస్తామని పోలీసుల ఎదుట థియేటర్ యాజమాన్యం హామీ ఇచ్చారు. దీంతో వివాదం సద్దుమణిగింది. కాగా సెన్సర్ బోర్డ్ సలార్ సినిమాకు ఏ సర్టిఫికెట్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఏ సర్టిఫికెట్ ఉన్న సినిమాలను 18 ఏళ్లు నిండని వారు చూడ్డానికి వీలు లేదు. అందుకే థియేటర్ యాజమాన్యం సహా.. పోలీసులు కూడా వారిని లోపలికి అనుమతించలేదు.

Updated : 24 Dec 2023 9:12 PM IST
Tags:    
Next Story
Share it
Top