Home > సినిమా > Bigg Boss 7 : బిగ్ బాస్ ఉల్టా పల్టా.. ఎలిమినేషన్లో బిగ్ ట్విస్ట్..

Bigg Boss 7 : బిగ్ బాస్ ఉల్టా పల్టా.. ఎలిమినేషన్లో బిగ్ ట్విస్ట్..

Bigg Boss 7  : బిగ్ బాస్ ఉల్టా పల్టా.. ఎలిమినేషన్లో బిగ్ ట్విస్ట్..
X

బిగ్బాస్ తెలుగు సీజన్ 7 రసవత్తరంగా సాగుతోంది. నాలుగో వారం ఎలిమినేషన్ టైం రానే వచ్చింది. ఈవారం నామినేషన్స్‌‌లో మొత్తం ఆరుగురు కంటెస్టెంట్స్ ఉన్నారు. ప్రిన్స్ యావర్, గౌతమ్, ప్రియాంక జైన్, శుభశ్రీ, రతిక, టేస్టీ తేజా నామినేషన్స్‌లో ఉన్నారు. ఈ వారం ఓటింగ్ ప్రక్రియను బట్టి రతిక, తేజ్ డేంజర్ జోన్లో ఉన్నారు. అయితే తేజ ఎలిమినేట్ అవుతాడని అంతా అనుకున్నారు. కానీ ఇక్కడే బిగ్ బాస్ ట్విస్ట్ ఇచ్చారు.



బిగ్ బాస్లో రతికపై సోషల్ మీడియాలో ఫుల్ నెగిటివిటీ ఉంది. ఆమె ఇంట్లో ఉంటున్న విధానంపై నెటిజన్లు దారుణంగా ట్రోల్స్ చేస్తున్నారు. లేడీ కట్టప్ప, బిగ్ బాస్ స్నేక్, వెన్నుపోటు రతిక అంటూ రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. నీ ఆట నువ్వు ఆడు.. మనుషులతో ఆడుకోకు అని హోస్ట్ నాగార్జున సైతం రతికకు క్లాస్ పీకిన లాభం లేకుండా పోయింది. పవర్ అస్త్ర టాస్క్లో ప్రశాంత్తో హద్దుమీరి మాట్లాడిన మాటలు కూడా ఆమెపై మరింత నెగిటివిటిని తెచ్చాయి. దీంతో ఓటింగ్ మొత్తం ఒక్కసారిగా తారుమారు అయినట్లు తెలుస్తోంది.

మొన్నటివరకు తేజ్ కన్ఫార్మ్గా ఎలిమినేట్ అవుతారని అంతా అనుకున్నారు. కానీ ఒక్కసారిగా సీన్ రివర్స్ అయ్యింది. నెటిజన్లు కోరుకున్నట్లు రతిక ఎలిమినేట్ అయ్యినట్లు తెలుస్తోంది. దీంతో హౌస్ మెట్స్ కూడా షాక్ అయ్యారట. అయితే ఈ సీజన్లో వరుసగా లేడి కంటెస్టెంట్స్ ఎలిమినేట్ అవడం గమనార్హం. ఫస్ట్ వీక్ కిరణ్ రాథోడ్, సెకండ్ వీక్ షకీల, థర్డ్ వీక్ దామిని ఎలిమినేట్ అవ్వగా.. ఈ వీక్ రతిక హౌస్కు గుడ్ బై చెప్పింది.

ఇక శనివారం ఎపిసోడ్లో టేస్టీ తేజను నాగ్ ఓ రేంజ్లో అరుసుకున్నాడు. బెల్ట్ టాస్క్‌లో టేస్టీ తేజా గౌతమ్ పట్ల దారుణంగా ప్రవర్తించిన విషయం తెలిసిందే. బెల్ట్ పీకకి వేసి లాగుతుంటే.. గౌతమ్ కృష్ణ మెడలు కోసుకుని పోయాయి. ఈ విషయంలోనే తేజతో పాటు సందీప్, శివాజీలపై నాగ్ ఫైర్ అయ్యాడు. ఆ ఎపిసోడ్ మాత్రం గౌతమ్ కు మస్త్ ప్లస్ అయ్యింది. అతడిపై ఒక్కసారిగా పాజిటివిటీ పెరిగిపోయింది.


Updated : 30 Sept 2023 9:42 PM IST
Tags:    
Next Story
Share it
Top