సలార్లో రాఖీ భాయ్.! కేజీఎఫ్తో ప్రభాస్ కథకు లింక్ ఏంటి..?
X
డైరెక్టర్ ప్రశాంత్ నీల్.. సలార్ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసినప్పటి నుంచి క్రేజ్ మామూలుగా లేదు. ఆదిపురుష్ తర్వాత వస్తున్న సినిమా కావడంతో ప్రభాస్ ఫ్యాన్స్ లో హైప్ పెరిగిపోయింది. ఈ సినిమాతో ప్రభాస్ కు భారీ హిట్ దొరుకుతుందని ఆశిస్తున్నారు. ఈ సినిమాలో ప్రభాస్ మాస్ యాంగిల్ లో కనిపించబోతున్న విషయం తెలిసిందే. ఇక మూవీ టీం విడుదలవుతున్న ప్రతీ పోస్టర్ సినిమాపై ఆసక్తిని మరింత పెంచుతున్నాయి. ఇదిలా ఉండగా.. తాజాగా ఈ సినిమా నుంచి ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
సినిమా ఫస్ట్ పోస్టర్ రిలీజ్ అయినప్పటి నుంచి.. సలార్ కు, కేజీఎఫ్ కథకు లింక్ ఉందనే పుకార్లు వస్తున్నాయి. వాటిలో ఎటువంటి నిజం లేదని మూవీ టీం క్లారిటీ ఇచ్చినా.. ఆ పుకార్లే వైరల్ అవుతున్నాయి. అవి నిజం అన్నట్లు.. కేజీఎఫ్ హీరోయిన్ శ్రీనిధి శెట్టి తనకు సంబంధం లేకున్నా.. ‘సలార్ సినిమా.. కేజీఎఫ్ ను మించి ఉంటుంద’ని స్టేట్మెంట్ ఇచ్చింది. తాజాగా ప్రశాంత్ నీల్ కూడా.. సలార్ సినిమా 10 కేజీఎఫ్ లతో సమానం అంటూ చెప్పుకొచ్చాడు. దాంతో ఈ రెండు సినిమాల కథలకు లింక్ ఉందని అభిమానులు గట్టిగా నమ్ముతున్నారు. వాటిని బలపరిచేలా.. గూగుల్ ఇస్తున్న ఇన్ఫర్మేషన్ కూడా కొత్త అనుమానాలకు తెరలేపుతుంది.
గూగుల్ లో సలార్ కాస్ట్ (పాత్రలు) అని సెర్చ్ చేయగా.. ప్రభాస్ తో పాటు కేజీఎఫ్ హీరో యశ్, కేజీఎఫ్ యాక్టర్స్ శరణ్ శక్తి, ఈశ్వరీ రావ్ ల పేర్లు కూడా వస్తున్నాయి. అంతేకాకుండా ఈశ్వరీ రావ్ ను సలార్ తల్లిగా చూపిస్తోంది. అదే నిజం అయితే.. కేజీఎఫ్ లో ఈశ్వరీ రావు కొడుకు సలార్ లో ప్రభాస్ అయ్యే అవకాశం ఉంది. ఈ వార్తలు కొందరు నెటిజన్స్ కొట్టిపడేస్తున్నారు. గూగుల్ ఇన్ఫర్మేషన్ ను ఎవరైనా ఎడిట్ చేయొచ్చని.. ఎవరో కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నారని అంటున్నారు.
ఓపెన్ లింక్..