ఈ వారం థియేటర్/ఓటీటీల్లో విడుదలయ్యే సినిమాలివే..
X
గత 4 వారాలుగా థియేటర్లలో చిన్న సినిమాలు కలెక్షన్ల వర్షం కురిపిస్తున్నాయి. ఇటీవల విడుదలైన బేబీ సినిమా సూపర్ హిట్ టాక్ తో టాలీవుడ్‌లో రికార్డులను సృష్టిస్తోంది. గత వారం విడుదలైన పవన్ కళ్యాణ్, సాయిధరమ్ తేజ్ నటించిన మల్లీస్టారర్ మూవీ బ్రో.. త్వరలోనే వంద కోట్ల క్లబ్ లో చేరనుంది. ఇక సంజయ్ రావు, ప్రణవి మానుకొండ నటించిన చిత్రం 'స్లమ్ డాగ్ హస్పెండ్' మంచి టాక్ ను సొంతం చేసుకుంది. వీకెండ్స్ లో థియేటర్ల వద్ద సందడి వాతావరణం నెలకొంది. ఇక రేపటి నుంచి కొత్త నెల ప్రారంభం కానుంది. ఆగస్టు నెలలో కూడా పెద్ద పెద్ద సినిమాలు రాబోతున్నాయి. మరి ఆగస్టు మొదటి వారంలో థియేటర్‌తో పాటు, ఓటీటీలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న చిత్రాలేవో చూసేయండి
ఎంఎస్ ధోని నిర్మాణంలో వస్తున్న ‘ఎల్‌జీఎం’
మాజీ క్రికెటర్ ఎం.ఎస్.ధోని నిర్మాణం నుంచి వస్తున్న తొలి చిత్రం ‘ఎల్‌జీఎం’ (LGM). లెట్స్ గెట్ మ్యారీడ్’.. అన్నది క్యాప్షన్. హరీష్ కల్యాణ్ (harish kalyan), ఇవానా (ivana) జంటగా నటించిన ఈ సినిమాని రమేష్ తమిళమణి తెరకెక్కించారు. సాక్షి ధోని, వికాస్ హస్జా నిర్మించారు. నదియా, యోగిబాబు కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా ఆగస్టు 4న ప్రేక్షకుల ముందుకు రానుంది.
కోడి పులావ్ సిద్ధం
శివ కోన, ప్రభాకర్, నేహా దేశ్ పాండే, కునాల్ కౌశల్, ప్రాచీ కెథర్, రమ్య దేష్, అభిలాష్ బండారి కీలక పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘రాజుగారి కోడిపులావ్’ (Rajugari kodipulao). శివ కోన స్వీయ దర్శకత్వంలో తెరకెక్కుతోంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా కూడా ఆగస్టు 4న ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఇప్పుడు కుదిరింది
విజయ్ ఆంటోని కథానాయకుడిగా బాబు యోగేశ్వరన్ తెరకెక్కించిన చిత్రం ‘విక్రమ్ రాథోడ్’ (Vikram Rathode). ఎస్.కౌశల్య రాణి నిర్మాత. సురేష్ గోపి, సోనూసూద్, యోగిబాబు తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఎప్పుడో షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఆగస్టు 4న థియేటర్‌లలో విడుదల కానుంది.
ఏం ‘మిస్టేక్’ జరిగింది?
అభినవ్ సర్దార్ హీరోగా నటిస్తూ.. స్వయంగా నిర్మించిన చిత్రం ‘మిస్టేక్’ (Mistake). భరత్ కొమ్మాలపాటి దర్శకుడు. ఆగస్టు 4న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. యాక్షన్, కామెడీ, సస్పెన్స్, థ్రిల్.. ఇలా అన్ని రకాల అంశాలు ఉన్న మూవీ మిస్టేక్ అని చిత్ర బృందం చెబుతోంది.
ఈ వారం ఓటీటీలో కూడా హిట్ సినిమాలు స్ట్రీమింగ్ కానున్నాయి. ఆగస్టు 4 న నెట్‌ఫ్లిక్స్‌లో రంగబలి (Rangabali) , సోనీలివ్ లో పరేషాన్ (pareshan), అమెజాన్ ప్రైమ్ వీడియో
లో ధూమం (dhoomam) (కన్నడ, తెలుగు) సినిమాలు రాబోతున్నాయి. డిస్నీ +హాట్‌స్టార్ లో దయా (dayaa) (తెలుగు సిరీస్) ఆగస్టు 5 నుంచి స్ట్రీమింగ్ కానుంది.