ఆ హీరో ఆత్మహత్యకు వారే కారణం..కంగనా రనౌత్ సంచలన వ్యాఖ్యలు
X
బాలీవుడ్ కాంట్రవర్సీ క్వీన్ కంగనా రనౌత్ మరోసారి సోషల్ మీడియా వేధికగా సంచలన వ్యాఖ్యలు చేసింది. బాలీవుడ్ ఇండస్ట్రీ, దేశ రాజకీయాలపైన తనదైన శైలిలో నిత్యం ఘాటైన విమర్శలు చేస్తూ హెడ్‌లైన్స్‌లో నిలిచే ఈ భామ తాజాగా బాలీవుడ్ ప్రముఖులపై కాంట్రవర్సీ కామెంట్స్ చేసి మరోసారి వార్తల్లో నిలిచింది. ఈసారి కంగనా నటుడు రణ్‌భీర్, ప్రొడ్యూజర్ కరణ్ జోహార్‌లను టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది.
"చిత్ర పరిశ్రమలో చాలా మంది చాలా రకాలుగా బెదిరిస్తుంటారు. అయితే కొంత మంది తమను తాము సమాచార, ప్రసార మంత్రులుగా భావిస్తుంటారు. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ సూసైడ్ వెనుక ప్రధానంగా వీరి హస్తం ఉంది. వీరు సుశాంత్‌ను ఆత్మహత్య చేసుకునేలా ప్రేరేపించారు. బాలీవుడ్‌లో ఈ విషయం అందరికీ తెలుసు. నన్ను వారు వదల్లేదు..నాపైన ఎన్నో అసత్య , అసభ్యమైన ప్రచారాలు చేశారు’’ అని హాట్ కామెంట్స్ చేసింది కంగనా. రణ్‌భీర్, కరణ్ జోహార్‌లను ఉద్దేశిస్తూ కంగనా చేసిన కామెంట్స్ ఇండస్ట్రీలో పెద్ద దుమారం లేపుతున్నాయి. వీరిద్దరిపై ఆరోపణలు చేయటం కంగనాకు కొత్తేమీ కాదు. కానీ సుశాంత్ సింగ్ సూసైడ్ కేసులో వీరిద్దరిని లాగటం హాట్ టాపిక్‌గా మారింది.
ఇండస్ట్రీకి వచ్చిన కొద్ది కాలంలోనే మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్. కానీ రంగుల లోకంలో ఎక్కువ కాలం నిలవలేకపోయాడు. జూన్ 14 2020లో తన ఇంట్లోనే ఆత్మహత్య చేసుకున్నాడు సుశాంత్. మూడేళ్లు కావస్తున్నా ఇప్పటికీ ఈ సూసైడ్ కేసులో నిందితులు ఎవరు అనేదానిపై క్లారిటీ రాలేదు. సుశాంత్ మరణంపై చాలా రకాల ఆరోపణలు వచ్చాయి. ఇండస్ట్రీతో సంబంధం లేని సుశాంత్ ఎదుగుదలను చూడలేకే అతనికి అవకాశాలు రానీయకుండా, ఎదగనీయకుండా చాలా మంది ప్రయత్నించారని , అందుకే తీవ్రమైన మనోవేధనతో సుశాంత్ డిప్రెషన్ లోకి వెళ్లిపోయి ఆత్మహత్య చేసుకున్నాడనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ కేసును ప్రస్తుతం సీబీఐ విచారిస్తోంది. ఈ నేపథ్యంలో కంగనా చేసిన కామెంట్స్ నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.